ప్రణయ్ హత్య కేసుపై తీర్పు నేడు
ABN , Publish Date - Mar 10 , 2025 | 04:30 AM
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుపై తీర్పును ఎస్సీ, ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు సోమవారం వెల్లడించనుంది.
ఏడు సంవత్సరాల పాటు సాగిన విచారణ
సుపారీ గ్యాంగ్‌తో చంపించినట్టు సాక్ష్యాలు సమర్పించిన పోలీసులు
నల్లగొండ క్రైం, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసుపై తీర్పును ఎస్సీ, ఎస్టీ రెండో అదనపు జిల్లా కోర్టు సోమవారం వెల్లడించనుంది. అమృత వర్షిణి, ప్రణయ్‌లు ప్రేమవివాహం చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో వీరి వివాహాన్ని అమృత తండ్రి మారుతీరావు ఒప్పుకోలేదు. మారుతీరావు.. సుపారీ గ్యాంగ్‌తో 2018 సెప్టెంబరు 14న ప్రణయ్‌ను హత్య చేయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రథమ నిందితుడు (ఎ-1)గా అమృత తండ్రి మారుతీరావు, సుపారీగ్యాంగ్‌కు చెందిన సుభా్‌షశర్మ ఎ-2గా, ఎ-3గా అజ్గర్ అలీ, ఎ-4గా అబ్దుల్ భారీ, ఎ-5గా కరీం, ఎ-6గా అమృత బాబాయి శ్రవణ్, ఎ-7గా శివ, ఎ-8గా నదీమ్‌లను పేర్కొంటూ పోలీసులు కేసు దర్యాప్తు చేశారు.
ఏడేళ్ల పాటు కోర్టులో విచారణ కొనసాగింది. సుపారీగ్యాంగ్ సాయంతో తండ్రి మారుతీరావు చంపించినట్టు పోసులు సాక్ష్యాలను సమర్పించారు. మానసికంగా కుంగిపోయిన మారుతీరావు బెయిల్ వచ్చిన ఆరు నెలల వ్యవధిలోనే 2020లో హైదరాబాద్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎ-2 సుభా్‌షశర్మ.. గుజరాత్ మాజీ హోం మంత్రి అరుణ్‌పాండే హత్య కేసుతో పాటు పలు కేసుల్లో నిందితుడిగా ప్రస్తుతం సబర్మతి జైలులో ఉన్నాడు. ఎ-3 అజ్గర్‌అలీ కూడా ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నాడు.
ఇవి కూడా చదవండి
BRS:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆర్ఎస్ ప్రవీణ్ పేరు పరిశీలన..
TG Assembly: 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
AICC: కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఎలా అంటే..
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..
Read More Latest Telugu News Click Here