VC Sajjanar: ఆ రివాల్వర్.. స్వాధీనం చేసుకోండి..
ABN , Publish Date - Dec 09 , 2025 | 07:54 AM
ఆ రివాల్వర్‌ను వెంటనే స్వాధీనం చేసుకోవాలని సిటీ పోలీస్ కమిషనర్ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అంబర్‌పేట ఎస్ఐ రివాల్వర్ మిస్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు
- అధికారులను ఆదేశించిన సీపీ
- అంబర్‌పేట పీఎస్‌ను తనిఖీ చేసిన సజ్జనార్
హైదరాబాద్: నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్(City Police Commissioner VC Sajjanar) సోమవారం అంబర్‌పేట పోలీస్ స్టేషన్(Amberpet Police Station)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేసుల పనితీరును పరిశీలించారు. ఇటీవల రివాల్వర్ మిస్సైయిన విషయం గురించి అధికారులతో చర్చించారు. రివాల్వర్‌ను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. పోలీసుల పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ డాక్టర్ బి.బాలస్వామి, అడిషనల్ డీసీపీ జోగుల నర్సయ్య, డివిజన్ ఏసీపీ హరీష్ కుమార్, అంబర్‌పేట సీఐ కిరణ్‌కుమార్, డీఐ హబీబుద్దీన్‌తో సీపీ మాట్లాడారు.

ఈ వార్తలు కూడా చదవండి..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
తుప్పు నష్టం రూ 8.8 లక్షల కోట్లు
Read Latest Telangana News and National News
