Share News

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

ABN , Publish Date - Mar 11 , 2025 | 03:59 AM

రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు కేటాయించాలని, బిల్లుల చెల్లింపుల్లోనూ ఈ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కోరారు.

Uttam: ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులివ్వాలి

  • ఆర్థికశాఖను కోరిన మంత్రి ఉత్తమ్‌

హైదరాబాద్‌, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు కేటాయించాలని, బిల్లుల చెల్లింపుల్లోనూ ఈ ప్రాజెక్టులకే ప్రాధాన్యం ఇవ్వాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు రూ.13 వేల కోట్లు, రుణాలకు రూ.13 వేల కోట్లు కలిపి... రూ.26 వేల కోట్లను రానున్న బడ్జెట్‌లో కేటాయించాలని ప్రతిపాదించారు. నీటిపారుదలశాఖ, పౌరసరఫరాల శాఖలకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సోమవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై మంత్రి ఉత్తమ్‌ ప్రతిపాదనలు అందించారు. శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌(టన్నెల్‌)తో పాటు ఏకే బీఆర్‌, సీతారామ, మల్లన్నసాగర్‌ నుంచి బస్వాపూర్‌, సింగూరులకు నీటి తరలింపు ప్యాకేజీలతో పాటు పాలమూరు-రంగారెడ్డిలో నార్లాపూర్‌-ఏదుల రిజర్వాయర్‌కు కాలువ పనులతో సీతారామ ప్రాజెక్టుతో పాటు ఏదుల నుంచి డిండి ఎత్తిపోతల పథకం ప్యాకేజీకి నిధులు కేటాయించాలని కోరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో నిధులన్నీ ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే వెచ్చించడంతో పాటు ఇతర ప్రాజెక్టులు పూర్తికాకపోవడం, పాత ప్రాజెక్టుల నిర్వహణనూ గాలికి వదిలేశారని డిప్యూటీ సీఎం భట్టి మండిపడ్డారు.


పాలమూరు ప్యాకేజీ-3 పూర్తి చేస్తే 60 టీఎంసీల నిల్వ: ఈఎన్‌సీ(జనరల్‌)

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ప్యాకేజీ-3 పనులు పూర్తిచేస్తే కరివెన రిజర్వాయర్‌ దాకా 60 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటుందని, మరికొన్ని పనులు పూర్తయితే ఉద్ధండపూర్‌ దాకా నీటిని తరలించి, 90 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం ఉంటుందని ఈఎన్‌సీ(జనరల్‌) జి.అనిల్‌కుమార్‌ గుర్తు చేశారు. జూరాల దిగువ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో గూడెందొడ్డి రిజర్వాయర్‌ సామర్యంం 15 టీఎంసీలకు పెంచుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. మున్నేరు-పాలేరు లింక్‌ పనులతో కాళేశ్వరంలోని ప్యాకేజీ-20, 21, 21ఏ, 22లను పూర్తి చేసుకోవడానికి నిధులు ఇవ్వాలని కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా

ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Mar 11 , 2025 | 03:59 AM