Share News

Uttam: కార్యకర్తలకు అండగా నిలబడాలి

ABN , Publish Date - Jan 26 , 2025 | 03:55 AM

‘‘ క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు అనేక కష్ట నష్టాలను ఓర్చుకుని పార్టీ పటిష్టత కోసం పనిచేయడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది. అధికారంలోకి వచ్చిన మనం..

Uttam: కార్యకర్తలకు అండగా నిలబడాలి

  • వారు కష్టపడినందువల్లే అధికారంలోకి వచ్చాం: ఉత్తమ్‌

  • కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు: మహేశ్‌కుమార్‌

హైదరాబాద్‌, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ‘‘ క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తలు అనేక కష్ట నష్టాలను ఓర్చుకుని పార్టీ పటిష్టత కోసం పనిచేయడం వల్లనే తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి రాగలిగింది. అధికారంలోకి వచ్చిన మనం.. ఇప్పుడు ఆ నాయకులు, కార్యకర్తలకు అండగా నిలబడాలి. వారిని ఆదుకోవాలి’’ అని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. కష్టపడ్డ నాయకులు, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని, అందరికీ తగిన గుర్తింపు కచ్చితంగా వస్తుందని భరోసా ఇచ్చారు. గాంధీభవన్‌లో శనివారం పార్టీ సీనియర్‌ నేత ప్రేమ్‌లాల్‌ సంతాప సభ జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ.. ప్రేమ్‌లాల్‌ వంటి క్రమశిక్షణ కలిగిన నాయకుడు లేకపోవడం పార్టీకి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబాన్ని తాను వ్యక్తిగతంగా, ప్రభుత్వ పరంగానూ ఆదుకుంటానని చెప్పారు. మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడ్డ కార్యకర్తలను ఆదుకోవడం తన కర్తవ్యమని, కష్టపడ్డ వారికి తప్పకుండా గుర్తింపు లభించేలా చేస్తామని చెప్పారు. కొందరికి అవకాశం వచ్చిందని, మిగతా వారికి లభించేలా ప్రయత్నాలు చేస్తామన్నారు.


నేటి నుంచి విప్లవాత్మక పథకాల అమలు: ఉత్తమ్‌

దేశంలో కెల్లా విప్లవాత్మక పథకాలు రాష్ట్రంలో అమలు కాబోతున్నాయని మంత్రి ఉత్తమ్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం నుంచి రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు కాబోతున్నాయని, కొత్త రేషన్‌ కార్డులూ ఇవ్వనున్నామని చెప్పారు. రేషన్‌ కార్డుల ద్వారా సన్నబియ్యం కూడా ఇవ్వబోతున్నామని తెలిపారు. పదేళ్లలో రేషన్‌ కార్డులు, సన్నబియ్యం ఇవ్వని బీఆర్‌ఎస్‌ నేతలు.. తమ ప్రభుత్వాన్ని విమర్శించడం అవివేకమన్నారు.


ఇవీ చదవండి:

క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్

రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jan 26 , 2025 | 03:55 AM