Traffic SI: ‘మందు తాగి బండి నడపనని ప్రామిస్ చెయ్ నాన్న’
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:00 AM
‘‘నాన్నా నువ్వు నాకు కావాలి. నువ్వు మందు తాగి బండి నడపనని నాకు ప్రామిస్ చెయ్’’ అని డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి అతని కుమారుడితోనే కౌన్సెలింగ్ ఇప్పించి వార్తల్లో నిలిచారు

డ్రంకెన్ డ్రైవ్‌లో చిక్కిన వ్యక్తికి కొడుకుతో కౌన్సెలింగ్
ఉప్పల్, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘నాన్నా నువ్వు నాకు కావాలి. నువ్వు మందు తాగి బండి నడపనని నాకు ప్రామిస్ చెయ్’’ అని డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వ్యక్తికి అతని కుమారుడితోనే కౌన్సెలింగ్ ఇప్పించి వార్తల్లో నిలిచారు ఉప్పల్ ట్రాఫిక్ ఎస్సై లక్ష్మిమాధవి. దీంతో ఆ తండ్రి కొడుకును హత్తుకొని ముద్దిచ్చి అతన్ని తీసుకొని వెళ్లిపోయాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కొందరు ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ తీరును ప్రశంసిస్తుండగా, మరి కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా ట్రాఫిక్ రూల్స్‌ను ఉల్లంఘిస్తే ప్రభుత్వ నిబంధనల ప్రకారం శిక్షలు అమలు చేయాలేగానీ, ఇష్టారాజ్యంగా సొంత రాజ్యాంగం ప్రకారం శిక్షలు వేయడం సరైంది కాదని అంటున్నారు.