Hyderabad: రేపు భారీ వర్షాలు!
ABN , Publish Date - May 20 , 2025 | 04:36 AM
ఈసారి ఎండాకాలం వానాకాలాన్ని తలపించింది. పొద్దంతా ఎండలు కాసినా సాయంత్రానికి వర్షాలు పడ్డాయి. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కంటే ఈదురుగాలులతో కూడిన వానలే ఎక్కువ కురిశాయి.
11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
నేడూ అక్కడక్కడ పడే చాన్స్
వడదెబ్బతో ఇద్దరి మృత్యువాత
హైదరాబాద్/ధారూరు, మే 19 (ఆంధ్రజ్యోతి): ఈసారి ఎండాకాలం వానాకాలాన్ని తలపించింది. పొద్దంతా ఎండలు కాసినా సాయంత్రానికి వర్షాలు పడ్డాయి. కొద్ది రోజులుగా ఎండ తీవ్రత కంటే ఈదురుగాలులతో కూడిన వానలే ఎక్కువ కురిశాయి. మంగళవారం కొన్నిచోట్ల.. బుఽధవారం చాలాచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, మేడ్చల్, మెదక్, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ములుగు.. మొత్తం 11 జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. మంగళవారం కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది.
ఇటు నైరుతి రుతుపవనాల విస్తరణకు అరేబియా సముద్రం, బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా మారింది. దీంతో దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, కొమరిన్ ప్రాంతం, దక్షిణ, మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయని వాతావరణశాఖ తెలిపింది. ఇక నారాయణపేట జిల్లా మక్తల్‌లో సోమవారం అత్యధికంగా 7.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవ్వగా, నిర్మల్ జిల్లా బీరెల్లిలో 41.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయింది. వడదెబ్బ తగిలి ఖమ్మం జిల్లా చింతకాని మండల వనరుల కేంద్రంలో పనిచేసే విద్యాశాఖ కాంట్రాక్టు ఉద్యోగి కవికొండల శ్రీనివాస వెంకటకృష్ణారావు (57), వైరా మునిసిపాలిటీలో రేకుల ముత్తమ్మ(49) మృతి చెందారు.
మండు వేసవిలో నిండుగా వాగు..
భారీ వర్షానికి వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని ధర్మాపూర్ వాగు మండు వేసవిలోనూ ఉరకలెత్తింది. మండలంలోని పలు గ్రామాల్లో తాజాగా కురిసిన వానలతో ధర్మాపూర్ వాగులోకి వరద నీరు భారీగా చేరటంతో సాయంత్రం నుంచి ఉధృతంగా ప్రవహించింది.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News