Share News

Telugu Women: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి

ABN , Publish Date - Dec 29 , 2025 | 11:44 AM

అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన (24), కడియాల భావన (24)..

Telugu Women: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి
California Road Accident

ఆంధ్రజ్యోతి, డిసెంబర్ 29: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన పుల్ల ఖండు మేఘన (24), కడియాల భావన (24) మృత్యువాతపడ్డారు.


అమెరికాలో ఉన్నత చదువులు.. ఉద్యోగాల కోసం వెళ్లిన ఈ యువతులు ప్రమాదంలో చిక్కుకున్నారు. ప్రమాద వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. స్థానిక అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ దుర్ఘటన మహబూబాబాద్ జిల్లాలోని వారి కుటుంబాలను తీవ్ర విషాదంలో ముంచింది. స్థానికులు పెద్ద ఎత్తున మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.


ఇవీ చదవండి:

సూపర్.. ప్రపంచంలో నెం.3 స్థానానికి చేరిన వెండి! ఏకంగా..

వామ్మో.. భగ్గుమన్న బంగారం, వెండి ధరలు

Updated Date - Dec 29 , 2025 | 11:44 AM