Share News

Cyber Crime: చైల్డ్‌ పోర్న్‌ వీక్షణ.. పాల్వంచలో ఇద్దరిపై కేసు

ABN , Publish Date - Aug 05 , 2025 | 05:42 AM

ఆన్‌లైన్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన ఇద్దరిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు.

Cyber Crime: చైల్డ్‌ పోర్న్‌ వీక్షణ.. పాల్వంచలో ఇద్దరిపై కేసు

పాల్వంచ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌లో చైల్డ్‌ పోర్నోగ్రఫీ వీడియోలు చూసిన ఇద్దరిపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ టౌన్‌ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్‌ క్రైమ్‌ విభాగం ఆన్‌లైన్‌ కార్యకలాపాలపై నిఘా పెట్టింది. ఈ నేపథ్యంలో పాల్వంచకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఓ యాప్‌లో తరచూ చైల్డ్‌ పోర్న్‌ వీడియోలు చూస్తున్నారని గుర్తించింది. చట్ట ప్రకారం ఇది నేరం కావడంతో, విషయాన్ని పాల్వంచ పోలీసులకు తెలియజేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరినీ గుర్తించి వారిపై కేసు నమోదు చేశారు.


ఇంజనీరింగ్‌ సీట్ల తారుమారుపై విచారణ చేపట్టాలి

  • బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు రామకృష్ణ

బర్కత్‌పుర, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌, కౌన్సెలింగ్‌ సీట్ల తారుమారుపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్‌ చేశారు. బాలికల సీట్లను బాలురకు కేటాయించడం అత్యంత దుర్మార్గమని ఆయన పేర్కొన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలల ఫీజుల విత్‌డ్రా తేదీని ఈ నెల 23 వరకు పొడిగించాలని కోరారు. సోమవారం కాచిగూడలో రామకృష్ణ విలేకరులతో మాట్లాడారు. ఓపెన్‌ బాలికల కోటాలో బాలురకు అక్రమంగా కేటాయించిన ఇంజనీరింగ్‌ సీట్లను తక్షణమే రద్దు చేసి మెరిట్‌ ప్రకారం అర్హులైన విద్యార్థినులకు తిరిగి కేటాయించాలని, తప్పిదానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని రామకృష్ణ కోరారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కాళేశ్వరం నివేదికపై ఆరోపణలు.. బీఆర్ఎస్ పార్టీ సంచలన నిర్ణయం

కవితకు షాక్ ఇచ్చిన కోర్టు

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 05 , 2025 | 05:42 AM