Tummala Nageswara Rao: బీజేపీ నేతలది అవివేకం!
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:06 AM
ప్రస్తుత ఖరీఫ్ ఎరువుల గురించి తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంటే.. బీజేపీ నేతలు గత యాసంగి గురించి మాట్లడటం
ఖరీఫ్ ఎరువుల గురించి అడుగుతుంటే గత యాసంగిపై వారు మాట్లాడుతున్నారు..
రామచందర్‌రావు వ్యాఖ్యలు అర్థరహితం: తుమ్మల
హైదరాబాద్, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత ఖరీఫ్ ఎరువుల గురించి తెలంగాణ ప్రభుత్వం అడుగుతుంటే.. బీజేపీ నేతలు గత యాసంగి గురించి మాట్లడటం వారి అవివేకానికి అద్దం పడుతోందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎద్దేవా చేశారు. 2024-25 యాసంగి మిగులు యూరియా 1.92 లక్షల మెట్రిక్ టన్నులు సర్కారు వద్ద ఉన్నందువల్లే.. ఈ ఖరీ్‌ఫలో కేంద్రం కేటాయింపుల ప్రకారం ఇవ్వకపోయినా సర్దుబాటు చేశామని చెప్పారు. ఎరువుల లెక్కలపై బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు చేసే అర్థరహిత వ్యాఖ్యలను ఏమాత్రం సహించేది లేదన్నారు. ‘మీకు లెక్కలు తెలియకుంటే.. తెలుసుకొని మాట్లాడాలి. కానీ.. ఎవరో రాసిచ్చింది కాదు. మీ అధ్యక్ష పదవిపై మీ పార్టీ నేతలకు చాలా మందికి కోరిక.. అందుకే మీతో ఇలాంటి మాటలు మాట్లాడించి.. రాజీనామా చేయించాలని చూస్తున్నారు’ అని వ్యాఖ్యానించారు. ‘ఈ ఖరీఫ్ సీజన్ కోసం కేంద్రాన్ని 11.50 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అడిగితే.. రాష్ట్రం వద్ద గత యాసంగి మిగులు 1.92 మెట్రిక్ లక్షల టన్నులు ఉండటంతో 9.80 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించింది. ఇందులో ఇప్పటివరకు 4.36 లక్షల మెట్రిక్ టన్నులే సరఫరా చేసింది. జూలై వరకు 2.24 లక్షల టన్నుల లోటు ఏర్పడింది. ఇక ఖరీఫ్ మొత్తానికి 5.44 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. రైతుల అవస్థల దృష్ట్యా ఈ మొత్తాన్ని కూడా ఆగస్టులోనే సరఫరా చేయాలని కేంద్రాన్ని కోరుతూ లేఖలు రాశాం’ అని వివరించారు. ఇప్పటికైనా రామచందర్‌రావు నిజాలు తెలుసుకొని రాష్ట్రానికి యూరియాను సకాలంలో తెప్పించడానికి కృషి చేస్తారని ఆశిస్తున్నానంటూ తుమ్మల పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్
ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..
For More International News And Telugu News