Share News

Tummala : 6 రోజుల్లోనే 7700 కోట్ల భరోసా నిధులిచ్చాం

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:32 AM

కోతలు తప్ప చేతలు ఉండవు కాబట్టే రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని, ఆ విషయాన్ని వారు మర్చిపోయినట్లు ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Tummala : 6 రోజుల్లోనే 7700 కోట్ల భరోసా నిధులిచ్చాం

  • బీఆర్‌ఎస్‌ హయాంలో ఎన్నడూ రూ.7,624 కోట్లు మించలేదు

  • ఔటర్‌ లోపలి సాగుభూములకు 2, 3 రోజుల్లో జమ చేస్తాం

  • వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి

హైదరాబాద్‌, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): కోతలు తప్ప చేతలు ఉండవు కాబట్టే రాష్ట్ర ప్రజలు బీఆర్‌ఎస్‌ను తిరస్కరించారని, ఆ విషయాన్ని వారు మర్చిపోయినట్లు ఉన్నారని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతుల తరఫున హక్కులు వారికే ఉన్నట్లుగా ప్రవర్తిస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులు ఒక్కసారి వారి హయాంలో రుణమాఫీ, రైతుబంధు పథకాలను ఎన్ని నెలల్లో అమలు చేశారో గుర్తుచేసుకోవాలని హితవు పలికారు. ఆ వివరాలు చూస్తే రైతుల ముందుకు రావడానికి కూడా వారికి ముఖం చెల్లదన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనలో రైతుబంధు నిధులు ఏ సీజన్‌లోనూ రూ.7624 కోట్లకు మించి విడుదల చేయలేదని చెప్పారు. తమ ప్రభుత్వం ఈ సీజన్‌లో కేవలం 6 రోజుల్లోనే రూ.7,700 కోట్లు విడుదల చేసిందన్నారు. గత ప్రభుత్వ హయాంలో 2021 వానాకాలం మినహా ఏ సీజన్‌లోనూ రెండు నెలల కంటే తక్కువ సమయంలో రైతుబంధు నిధులు విడుదల చేయలేదని చెప్పారు.


ఈ మేరకు బీఆర్‌ఎస్‌ సర్కారు రైతుబంధు నిధులు విడుదల చేసిన తేదీలు, సొమ్ముల లెక్కలతో సహా మంత్రి తుమ్మల శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కేవలం 6 రోజుల్లోనే రైతుభరోసా కింద రూ.7770.83 కోట్లు ఖర్చు చేసిన ఘనత కాంగ్రె్‌సకే దక్కుతుందన్నారు. అదేవిధంగా ఔటర్‌ రింగు రోడ్డు లోపలివైపు దాదాపు 2.18 లక్షల ఎకరాల భూములుంటే.. వాటిలో సుమారు 93 వేల ఎకరాలు సాగుకు అనువుకానివి ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. సాగులో ఉన్న మిగతా 1.20 లక్షల ఎకరాల భూముల రైతులకు రెండు మూడు రోజుల్లోనే రైతుభరోసా నిధులు జమచేయనున్నట్లు వెల్లడించారు. సాగు భూములకే భరోసా నిధులు ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ఓఆర్‌ఆర్‌ లోపల భూములున్న రైతులకు పథకాన్ని వర్తింపజేయడానికి సమయం పట్టిందని స్పష్టంచేశారు. ఈ విషయాన్ని కూడా బీఆర్‌ఎస్‌ నాయకులు రాజకీయ లబ్ధి కోసం వాడుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్‌ ఇచ్చిన మాట ప్రకారం సాగు చేసే ప్రతి గుంట భూమికీ రైతుభరోసా సాయాన్ని అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తుమ్మల స్పష్టంచేశారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో విడుదల చేసిన రైతుబంధు వివరాలు (నిఽధులు రూ.కోట్లలో)

సంవత్సరం నిధులు మొదలైన తేదీ పూర్తయిన తేదీ చెల్లింపు సమయం (నెలల్లో)

2018 5,237.56 మే 10 సెప్టెంబరు 15 4 నెలల 5 రోజులు

2019 6,125.54 జూన్‌ 4 అక్టోబరు 14 4 నెలల 10 రోజులు

2020 7,288.70 జూన్‌ 22 డిసెంబరు 8 5 నెలల 16 రోజులు

2022 7,434.67 జూన్‌ 28 సెప్టెంబరు 5 2 నెలల 8 రోజులు

2023 7,624.75 జూన్‌ 26 అక్టోబరు 12 3 నెలల 20 రోజులు


ఇవి కూడా చదవండి..

9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను

For International News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 04:32 AM