Mahesh Kumar Goud: కాంగ్రెస్‌పై అక్కసుతోనే యూరియా సరఫరా చేయట్లేదు
ABN , Publish Date - Aug 20 , 2025 | 04:44 AM
కాంగ్రె్‌సపై ఉన్న అక్కసుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన మేరకు యూరియాను సరఫరా చేయట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు.
తెలంగాణ వాటాను వెంటనే ఇవ్వాలి
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్ డిమాండ్
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌పై ఉన్న అక్కసుతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన మేరకు యూరియాను సరఫరా చేయట్లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన యూరియా వాటాను తక్షణమే కేంద్రం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తుంటే కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఢిల్లీలో నిద్రపోతున్నారని విమర్శించారు. యూరియా కోసం ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాశారన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్ లోపాయికార ఒప్పందంతోనే యూరియాను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మాజీ రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ జయంతి సందర్భంగా మంగళవారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మహేశ్‌గౌడ్, టీపీసీసీ ఉపాధ్యక్షుడు కుమార్‌రావు తదితరులు నివాళులర్పించారు. కాగా, తాండూరు నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నేతలు మంగళవారం నాడు ఎమ్మెల్యే మనోహర్‌రెడి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మహేశ్‌గౌడ్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
దక్షిణమధ్య రైల్వేలో మహిళా శక్తి! మహిళల పర్యవేక్షణలో ఐదు కీలక విభాగాలు
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఐదు కీలక విభాగాలకు మహిళల నేతృత్వంతో దక్షిణ మధ్య రైల్వే ‘మహిళా శక్తి’కి తార్కాణంగా నిలుస్తోంది. రైళ్ల కార్యకలాపాల నిర్వహణలో సంక్లిష్టమైన, వ్యూహాత్మక నిర్ణయాలతో కూడిన ఆపరేటింగ్ శాఖకు కె.పద్మజ ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. టికెట్ల విక్రయం, రిజర్వేషన్లు, ేస్టషన్ల నిర్వహణ, సరుకు రవాణా, మార్కెటింగ్, ఆదాయ వనరుల పెంపు బాధ్యతలు నిర్వర్తించే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్‌గా ఇటీ పాండే.. రైల్వే, ప్రయాణికుల భద్రతకు కీలకమైన ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్‌గా అరోమాసింగ్ ఠాకూర్.. ప్రిన్సిపల్ చీఫ్ మెడికల్ డైరెక్టర్‌గా డాక్టర్ నిర్మల నరసింహన్.. ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్‌గా హేమ సునీత విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హౌసింగ్ స్కీమ్‌లో అవినీతి.. మంత్రి ఉత్తమ్ చర్యలు
ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న ఎన్డీఏ.. సీఎం రేవంత్ ఫైర్
For More Telangana News and Telugu News..