Share News

Telangana Tourism Conclave: టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ.15,279 కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్

ABN , Publish Date - Sep 27 , 2025 | 06:25 PM

తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక్క పాలసీ లేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.

Telangana Tourism Conclave: టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ.15,279 కోట్ల పెట్టుబడులు: సీఎం రేవంత్
CM Revanth Reddy

హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా టూరిజంకు ఒక్క పాలసీ లేదని, తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత టూరిజంకు ప్రత్యేక పాలసీ తీసుకువచ్చామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్‌ శిల్పారామంలో ఏర్పాటు చేసిన వరల్డ్‌ టూరిజం డే మొదటి కాంక్లేవ్‌లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. టూరిజం కాంక్లేవ్‌లో తెలంగాణకు రూ.15,279 కోట్ల పెట్టుబడులతోపాటు 50 వేల మంది ఉపాధికి సంబంధించి ఒప్పందాలు జరిగాయి. మొత్తం 30 ప్రాజెక్టులకు సంబంధించి రూ.15,279 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు (Telangana tourism news).


ఈ పెట్టుబడులతో 19,520 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు రాబోతున్నాయని, పరోక్షంగా 30 వేల మందికి ఉపాధి లభించనుందని, మొత్తం 50,000 మందికి ఉపాధి అవకాశాలు కలుగబోతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పెట్టుబడులతో 10,000 కొత్త హోటల్ గదులు, థీమ్ పార్కులు, ఫిలిం టూరిజం, వెడ్డింగ్ డెస్టినేషన్స్ అభివృద్ధితో తెలంగాణను గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దనున్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. పర్యాటక రంగంలో రూ.15 వేల కోట్లకు పైగా పెట్టుబడులు తీసుకొచ్చిన మంత్రి జూపల్లి కృష్ణారావును అభినందించారు (Tourism investment news).


హైదరాబాద్ ఓల్డ్ సిటీ కాదని, ఇది ఒరిజినల్ సిటీ అని, నగరాన్ని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు (Tourism development Telangana). ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీపడుతోందని అన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని పెట్టుబడిదారులకు సూచించారు. ఇండియా పాకిస్థాన్ యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా హైదరాబాద్‌లో ప్రపంచ సుందరీమణుల పోటీలు నిర్వహించామని గుర్తు చేశారు. శాంతిభద్రతల విషయంలో తెలంగాణ సురక్షితమైన ప్రదేశమని, మీ పెట్టుబడులకు ఇక్కడ రక్షణ ఉంటుందని హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యం: సీఎం రేవంత్‌రెడ్డి

ఓటు చోరీపై మహేష్ గౌడ్ సంచలన ఆరోపణలు

Read Latest Telangana News and National News

Updated Date - Sep 27 , 2025 | 08:16 PM