Share News

‘తిరుపతి’ బాధితులకు చెక్కుల అందజేత

ABN , Publish Date - Jan 21 , 2025 | 04:03 AM

తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన కృష్ణారెడ్డి, బుచ్చమ్మను టీటీడీ సభ్యులు పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి పరామర్శించారు.

‘తిరుపతి’ బాధితులకు చెక్కుల అందజేత

నిజాంపేట్‌, సరూర్‌నగర్‌, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): తిరుపతి తొక్కిసలాటలో గాయపడిన కృష్ణారెడ్డి, బుచ్చమ్మను టీటీడీ సభ్యులు పనబాక లక్ష్మి, నన్నూరి నర్సిరెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా వారికి టీటీడీ తరఫున రూ.2లక్షల చెక్కును అందజేశారు. అదేవిధంగా నిజాంపేట్‌, బండారి లే-అవుట్‌లో నివాసం ఉంటున్న సావిత్రి, సాంబశివరెడ్డిలకు చెరో రూ. 2 లక్షల చెక్కులను ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భవిష్యత్‌లో ఇటువంటి దురదృష్టకర సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jan 21 , 2025 | 04:03 AM