Hyderabad: కుమ్మరిగుట్టపై పెద్దపులి సంచారం..
ABN , Publish Date - Sep 27 , 2025 | 10:45 AM
నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగార పరిధిలోని కుమ్మరి గుట్టపై పెద్దపులి కనిపించిందని దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దుర్గం ఐలయ్య తెలిపారు. శుక్రవారం ఐలయ్య తన గొర్రెల మందను మేపుట కోసం బాటసింగారం పరిధిలోని కుమ్మరి గుట్టకు తోలుకెళ్లాడు.
- అమ్మో పెద్దపులి.. గొర్రెను పట్టిందన్న కాపరి
హైదరాబాద్: నగర శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండలం బాటసింగారం(Batasingaram) పరిధిలోని కుమ్మరి గుట్టపై పెద్దపులి కనిపించిందని దేశ్‌ముఖ్ గ్రామానికి చెందిన గొర్రెల కాపరి దుర్గం ఐలయ్య తెలిపారు. శుక్రవారం ఐలయ్య తన గొర్రెల మందను మేపుట కోసం బాటసింగారం పరిధిలోని కుమ్మరి గుట్టకు తోలుకెళ్లాడు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ముసురు వర్షం కురుస్తుండగా మందలోని ఓ పొట్టెలుపై పెద్దపులి దాడి చేసి లాక్కెళ్తుందని చెప్పాడు.

వెంటనే కేకలు వేశానని తన వెంట ఉన్న కుక్కలు మొరగడంతో గొర్రెను విడిచి అక్కడి నుంచి గుట్టలోకి వెళ్లిందన్నాడు. భయంతో వెంటనే అక్కడి నుంచి గొర్రెలను తోలుకుని గుట్ట కిందికి వచ్చేశానని ఆయన పేర్కొన్నారు. కచ్చితంగా అది పెద్దపులి అని ఆయన చెప్పారు. పలు గ్రామాలకు సమీపంలో ఉన్న ఈ గుట్టపై పెద్దపులి కనిపించిందన్న ప్రచారంతో ప్రజలు భయాందోళనకు గురౌతున్నారు. ఈ విషయాన్ని ఫారెస్ట్ అధికారులు సీరియ్‌సగా తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ధరల్లో స్వల్ప పెరుగుదల! నేటి రేట్స్ ఇవే..
ట్రిపుల్ ఆర్ బాధితుల ఆరోపణలు నిజమే
Read Latest Telangana News and National News