Hyderabad: వారికి మరోసారి అవకాశం..
ABN , Publish Date - Feb 25 , 2025 | 11:52 AM
కులగణనలో చాలామంది వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అల్వాల్ సర్కిల్(Alwal Circle) అధికారులకు ఆదేశాలు రావడంతో మరోసారి కులగణన నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
- కులగణనలో వివరాలు ఇవ్వని వారు ఈనెల 28 వరకు నమోదు చేసుకోవచ్చు
- టోల్ ఫ్రీ నంబర్‌కు వందకు పైగా కాల్స్
హైదరాబాద్: కులగణనలో చాలామంది వివరాలు ఇవ్వడానికి నిరాకరించారు. అలాంటి వారి కోసం ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించింది. అల్వాల్ సర్కిల్(Alwal Circle) అధికారులకు ఆదేశాలు రావడంతో మరోసారి కులగణన నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సర్కిల్ పరిధిలో మూడు డివిజన్‌లు ఉన్నాయి. ప్రతి వార్డు కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌లను అందుబాటులో ఉంచారు. వార్డుకు సూపర్‌వైజర్, 10 మంది ఎన్యూమరేటర్లను నియమించారు.
ఈ వార్తను కూడా చదవండి: MLA: ఎమ్మెల్యే ‘మాధవరం’ అంతమాట అనేశారేంటో.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

గతంలో కులగణనలో వివరాలు ఇవ్వని వారు టోల్‌ఫ్రీ నెంబర్ 040-21111111కు ఫోన్ చేస్తే కంప్యూటర్ ఆపరేటర్లు నమోదు చేసుకుని ఎన్యూమరేటర్లకు పంపిస్తారు. ఫోన్ చేసిన వారి ఇంటికి ఎన్యూమరేటర్లు వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. వివరాలు ఇవ్వాలనుకునే వారు నేరుగా ఆధార్ ఇతర వివరాలతో సంబంధిత వార్డు కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ ఆపరేటర్ లేదా ఎన్యూమరేటర్‌ను కలిస్తే అప్పటికప్పుడు దరఖాస్తులను ఇచ్చి వివరాలను నమోదు చేస్తారు. అల్వాల్ సర్కిల్ పరిధిలో టోల్ ఫ్రీ నంబర్‌కు ఇప్పటి వరకు వందకు పైగా కాల్స్ వచ్చాయి. ఈనెల 28 వరకు కులగణనలో వివరాలు నమోదు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
ఈవార్తను కూడా చదవండి: ఏఆర్ డెయిరీ ఎండీకి చుక్కెదురు
ఈవార్తను కూడా చదవండి: మేళ్లచెర్వులో మొదలైన జాతర సందడి
ఈవార్తను కూడా చదవండి: Kishan Reddy: బీఆర్‌ఎస్‌తో రేవంత్ కుమ్మక్కు
ఈవార్తను కూడా చదవండి: బాసరలో కిటకిటలాడుతున్న క్యూ లైన్లు, అక్షరాభ్యాస మండపాలు
Read Latest Telangana News and National News