Tummala: ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకం పెంచాలి
ABN , Publish Date - Jul 04 , 2025 | 04:23 AM
ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు తుమ్మల లేఖ
హైదరాబాద్, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని గతంలో మాదిరిగా 44 శాతానికి పెంచాలని కోరుతూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు. దిగుమతి సుంకం తగ్గింపుతో వంటనూనెల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించలేమన్నారు.
కేంద్రం మే 31న ముడి పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గించిందని తెలిపారు. రైతులకు లాభదాయకంగా ఉంటేనే పామాయిల్ సాగుకు ముందుకొస్తారని, కేంద్ర ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని తగ్గించడం బాధాకరమని తుమ్మల పేర్కొన్నారు. దిగుమతి సుంకాన్ని పెంచాలని నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
రాయచోటిలో ఉగ్రవాదులు అరెస్ట్.. కీలక అప్ డేట్..
తెలంగాణ నీటి వాటాను ఏపీకి దారాదత్తం చేశారు.. కేసీఆర్, హరీష్‌లపై మహేష్ గౌడ్ ఫైర్
టాలీవుడ్‌లో పైరసీ గుట్టు రట్టు.. ఒకరి అరెస్ట్
Read latest Telangana News And Telugu News