Share News

Irrigation Department: నీటి పారుదలలో ‘ప్రమోషన్లపై డీపీసీ వేయాలి

ABN , Publish Date - Jul 06 , 2025 | 04:08 AM

తమ శాఖలోని వివిధ అధికారులకు పదోన్నతి కల్పనకు శాఖాపరమైన పదోన్నతుల కమిటీ వేయాలని రాష్ట్ర పరిపాలనాశాఖ (జీఏడీ)కి నీటి పారుదలశాఖ శనివారం లేఖ రాసింది.

Irrigation Department: నీటి పారుదలలో ‘ప్రమోషన్లపై డీపీసీ వేయాలి

హైదరాబాద్‌, జూలై 5 (ఆంధ్రజ్యోతి): తమ శాఖలోని వివిధ అధికారులకు పదోన్నతి కల్పనకు శాఖాపరమైన పదోన్నతుల కమిటీ వేయాలని రాష్ట్ర పరిపాలనాశాఖ (జీఏడీ)కి నీటి పారుదలశాఖ శనివారం లేఖ రాసింది. 120 మంది అసిస్టెంట్‌ ఇంజనీర్లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లుగా, 15 మంది సూపరింటెండెంట్‌ ఇంజనీర్లకు చీఫ్‌ ఇంజనీర్లుగా పదోన్నతుల కల్పనకు చర్యలు తీసుకోవాలని జీఏడీకి నీటి పారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌ బొజ్జా లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్‌ విభాగం సమర్పించిన నివేదికలో 38 మంది ఇంజనీర్ల (మాజీ ఇంజనీరు)పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపారసులు చేసింది. విజిలెన్స్‌ కమిటీ సిపారసుల మేరకు ‘మీపై ఎందుకు చర్య తీసుకోరాదో చెప్పాలంటూ సదరు 38 మంది ఇంజనీర్లకు నీటి పారుదలశాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది.


నేటి నుంచి ఇంజనీరింగ్‌ వెబ్‌ ఆప్షన్ల ప్రక్రియ

హైదరాబాద్‌ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్‌ ప్రవేశాల కౌన్సెలింగ్‌లో భాగంగా ఆదివారం నుంచి వెబ్‌ కౌన్సెలింగ్‌ ప్రక్రియను ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సాంకేతిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి శనివారం వరకు ఎప్‌సెట్‌లో ర్యాంకులు పొందిన అభ్యర్థుల్లో 94,265 మంది ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్‌ బుకింగ్‌ చేసుకున్నారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఈ నెల 8 వరకు గడువు ఉండగా, అభ్యర్థులు 10వ తేదీలోగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చన్నారు. 13న మాక్‌ సీట్‌ అలాట్‌మెంట్‌, 18న తొలి విడత ప్రొవిజినల్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ ఉంటుందని అధికారులు తెలిపారు.


ఇవి కూడా చదవండి

తిరుపతికి వెళ్లేందుకు గూగుల్‌ను నమ్మారు.. తీరా చూస్తే

మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు: డిప్యూటీ సీఎం భట్టి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 06 , 2025 | 04:08 AM