ఏప్రిల్ 29 నుంచి ఎప్‌సెట్
ABN , Publish Date - Jan 16 , 2025 | 03:46 AM
ఇంజనీరింగ్, ఫార్మా, న్యాయ విద్య, ఎంబీఏ, ఎంసీఏ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి బుధవారం ప్రకటించింది.

జూన్ 6న లాసెట్.. 8న ఐసెట్.. వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదల పూర్తి వివరాలతో త్వరలో సెట్ల వారీగా నోటిఫికేషన్లు
హైదరాబాద్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, ఫార్మా, న్యాయ విద్య, ఎంబీఏ, ఎంసీఏ సహా వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశ పరీక్షల తేదీలను తెలంగాణ ఉన్నత విద్యా మండలి బుధవారం ప్రకటించింది. దీని ప్రకారం.. ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్‌సెట్ పరీక్షలు ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు నిర్వహించనున్నారు. జేఎన్‌టీయూ ఆధ్వర్యంలో జరిగే ఎప్‌సెట్‌లో అగ్రి, ఫార్మసీ కోర్సుల పరీక్షలను ఏప్రిల్ 29, 30 తేదీల్లో, ఇంజనీరింగ్ విభాగం పరీక్షలను మే 2 నుంచి 5వ తేదీ వరకు జరగనున్నాయి. మార్చి 25వ తేదీతో ఇంటర్మీడియట్ పరీక్షలు ముగుస్తాయి. ఆ తర్వాత నెల రోజులకు ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
గతంలో పోలిస్తే ఈసారి కాస్త ముందుగానే ఎప్‌సెట్ పరీక్షలు మొదలవ్వనున్నాయి. ఇక, ఉస్మానియా విశ్వవిద్యాలయం నిర్వహించే ఈ-సెట్ పరీక్షలు మే12న జరగనున్నాయి. న్యాయ విద్య కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించి నిర్వహించే లాసెట్ పరీక్షలను జూన్ 6న నిర్వహిస్తారు. ఇక, ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి సంబంధించిన ఐసెట్ జూన్ 8,9 తేదీల్లో, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పీజీఈసెట్ పరీక్షలు జూన్ 16-19 తేదీల్లో జరగనున్నాయి. ఆయా పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ, ఫీజు తదితర పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్లను సెట్ల వారీగా త్వరలో విడుదల చేస్తారు.
ప్రవేశ పరీక్షల షెడ్యూల్
పరీక్ష తేదీలు
ఎప్‌సెట్ (ఎంసెట్) ఏప్రిల్ 29- మే 5
ఈసెట్ మే 12
ఎడ్‌సెట్ జూన్ 1
లాసెట్ జూన్ 6
ఐసెట్ జూన్ 8,9
పీజీఈసెట్ జూన్ 16-19
పీఈసెట్ జూన్ 11-14