అడిగిన రుణంలో కేంద్రం కోత
ABN , Publish Date - Jan 25 , 2025 | 04:34 AM
రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28న తీసుకోవాలనుకున్న రూ.2,500 కోట్ల అప్పునకుగాను... రూ.1,800 కోట్ల రుణానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.700 కోట్ల అప్పునకు కోత పెట్టింది.

రూ.2500 కోట్లు తీసుకోవాలనుకుంటే రూ.1,800 కోట్ల అప్పునకే అనుమతి
హైదరాబాద్, జనవరి 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 28న తీసుకోవాలనుకున్న రూ.2,500 కోట్ల అప్పునకుగాను... రూ.1,800 కోట్ల రుణానికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. రూ.700 కోట్ల అప్పునకు కోత పెట్టింది. దీంతో రూ.1,800 కోట్ల అప్పు కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఇండెంటు పెట్టింది. ఈ నెలలో మొత్తం రూ.10 వేల కోట్ల అప్పు తీసుకుంటామంటూ ఆర్‌బీఐకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. ఇందులో ఈ నెల 7న రూ.3000 కోట్ల అప్పు తీసుకున్నది. 14న తీసుకోవాల్సిన రూ.2000 కోట్లు, 21న తీసుకోవాల్సిన రూ.2,500 కోట్ల అప్పునకు కేంద్రం అనుమతించలేదు.
దాంతో ప్రతిపాదిత రూ.10వేల కోట్ల అప్పులో రూ.4,500 కోట్లకు కోత పడింది. తాజాగా 28న తీసుకోవాల్సిన రూ.2,500 కోట్ల అప్పులో మరో రూ.700 కోట్లకు కేంద్రం కోత పెట్టింది. దీంతో ఈ నెలలో రాష్ట్ర ప్రభుత్వానికి అందే అప్పు మొత్తం రూ.4,800 కోట్లు మాత్రమే. మిగతా రూ.5,200 కోట్ల అప్పునకు కోత పడినట్లే. అయితే... ఈ నెల 28న తీసుకోవాల్సిన రూ.1,800 కోట్ల అప్పులో 24 ఏళ్ల కాల పరిమితితో రూ.1000 కోట్లు, 25ఏళ్ల కాల పరిమితితో రూ.800 కోట్ల చొప్పున రుణాన్ని తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఆర్‌బీఐకి తెలియజేసింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Virender Sehwag: విడాకులు తీసుకోనున్న వీరేంద్ర సెహ్వాగ్..
Kaleshwaram Commission: నేటి కాళేశ్వరం విచారణ.. అత్యంత కీలకం