Share News

Digital Economy: ‘గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌ హబ్‌’గా తెలంగాణ

ABN , Publish Date - Sep 05 , 2025 | 04:15 AM

తెలంగాణను ‘గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌ హబ్‌’గా మార్చాలన్న తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యూ ఏఈ భాగస్వామ్యం కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు.

Digital Economy: ‘గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌ హబ్‌’గా తెలంగాణ

  • ‘ఏఐ’ ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఏర్పాటు చేయండి

  • డీప్‌-టెక్‌, ఏఐ స్టార్ట్‌పలలో పెట్టుబడులు పెట్టండి

  • యూఏఈ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి శ్రీధర్‌ బాబు

హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను ‘గ్లోబల్‌ డిజిటల్‌, ఇన్నోవేషన్‌ హబ్‌’గా మార్చాలన్న తమ ప్రభుత్వ లక్ష్య సాధనలో యూ ఏఈ భాగస్వామ్యం కావాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు కోరారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ఏఐ, డిజిటల్‌ ఎకానమీ అండ్‌ రిమోట్‌ వర్క్‌ అప్లికేషన్స్‌ మంత్రి ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామాతో గురువారం శ్రీధర్‌ బాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌లో తెలంగాణ భాగస్వామ్యంతో ‘ఏఐ’ ఆర్‌అండ్‌ డీ సెంటర్‌ ను ప్రారంభించేందుకు ముందుకురావాలని మంత్రి ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామాను ఆహ్వానించారు. డీప్‌-టెక్‌, ఏఐ స్టార్ట్‌పలలో పెట్టుబడులు పెట్టడానికి యూఏఈ సావరిన్‌ ఫండ్స్‌, వెంచర్‌ క్యాపిటల్‌ సంస్థలకు మంచి అవకాశాలున్నాయన్నారు. గేమింగ్‌లో ‘తెలంగాణ-యూఏఈ ఫ్యూచర్‌ స్కిల్స్‌ అకాడమీ’ ఏర్పాటుకు ముందుకురావాలని యూఏఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా యూఏఈ మంత్రి ఓమర్‌ బిన్‌ సుల్తాన్‌ అల్‌ ఓలామా మాట్లాడుతూ.. ఏఐ, డిజిటల్‌ ఎకానమీ, క్లౌడ్‌, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, గేమింగ్‌ తదితర రంగాల్లో తెలంగాణతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. యూఏఈ ప్రభుత్వ ఏఐ ఆధారిత ‘స్టార్‌ గేట్‌’ ప్రాజెక్టులో తెలంగాణ కీలక భాగస్వామిగా మారాలని ఆకాంక్షించారు. త్వరలో యూఏఈలో నిర్వహించనున్న ‘ఫిన్‌ టెక్‌ స్టార్టప్స్‌’ సమ్మిట్‌లో తెలంగాణ కంపెనీలను భాగస్వాములను చేస్తామని చెప్పారు.


సాంతికేతిక లోపంతో 3 విమానాలు రద్దు

శంషాబాద్‌ రూరల్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక లోపంతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి వేర్వేరు మార్గాల్లో వెళ్లాల్సిన 3 విమాన సర్వీసులు రద్దయ్యాయి. హైదరాబాద్‌- తిరుపతి వెళ్లాల్సిన ఎస్‌జీ స్పైస్‌జెట్‌-2138 సర్వీసు, శంషాబాద్‌-శివమొగ్గ మధ్య తిరిగే ఎస్‌జీ 2708 విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో సర్వీసు రద్దు చేసినట్లు జీఎంఆర్‌ అధికారులు చెప్పారు. ఖతార్‌-ఫిలిప్పీన్స్‌ వెళుతున్న సర్వీసు ‘క్యూఆర్‌ 936’ విమాన ప్రయాణికుడొకరు తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేశారు. మరమ్మత్తు తర్వాత సాంకేతిక లోపంతలెత్తడంతో ఆ విమాన సర్వీ్‌సనూ రద్దు చేశారు. మరోవైపు, ఢిల్లీలో భారీ వర్షాల వల్ల ఢిల్లీ- శంషాబాద్‌ మధ్య నడిచే విమాన సర్వీసులు ఆలస్యంగా నడిచాయి.


ఈ వార్తలు కూడా చదవండి

సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

22 నుంచి దసరా ఉత్సవాలు.. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు: మంత్రి ఆనం

Read Latest TG News and National News

Updated Date - Sep 05 , 2025 | 04:15 AM