Share News

Agriculture Department Urea: ఎరువులు అక్రమంగా నిల్వచేస్తే చర్యలు

ABN , Publish Date - Jul 19 , 2025 | 04:14 AM

వానాకాలం ప్రారంభం కావడంతో రైతులు పంటలు సాగు చేసే వేళ.. అక్రమంగా యూరియా నిల్వ చేసే డీలర్లపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి హెచ్చరించారు.

Agriculture Department Urea: ఎరువులు అక్రమంగా నిల్వచేస్తే చర్యలు

  • డీలర్లకు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి. గోపి హెచ్చరిక

  • ఫిర్యాదులకు 89777-41771 నంబర్‌కు ఫోన్‌ చేయొచ్చు

హైదరాబాద్‌, జులై 18 (ఆంధ్రజ్యోతి): వానాకాలం ప్రారంభం కావడంతో రైతులు పంటలు సాగు చేసే వేళ.. అక్రమంగా యూరియా నిల్వ చేసే డీలర్లపై చట్ట ప్రకారం చర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బి.గోపి హెచ్చరించారు. జిల్లా స్థాయిలో యూరియా, ఇతర ఎరువుల నిల్వలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని అధికారులకు ఆదేశించారు. ఎక్కువ మొత్తం ఎరువులు నిల్వ చేసి, బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మడానికి ప్రయత్నించే డీలర్లపై కేసులు నమోదు చేయాలన్నారు. వివిధ రాష్ట్రాల వ్యవసాయశాఖ ఉన్నతాధికారులతో కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శులు రజత్‌ కుమార్‌ మిశ్రా, దేవేష్‌ చతుర్వేది శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.


అనంతరం డైరెక్టర్‌ గోపి అధికారులతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ ఎరువుల సరఫరాపై కేంద్ర తనిఖీల బృందాలు కూడా రాష్ట్రాల్లో తనిఖీలు చేపట్టే అవకాశం ఉందన్నారు. రైతుల అవసరాల మేరకు యూరియా పంపిణీ చేయాలని డీలర్లను ఆదేశించారు. నిర్థారించిన ధరకంటే ఎక్కవ ధరకు యూరియా విక్రయించినా కఠిన చర్యలు తప్పవన్నారు. యూరియా, ఇతర ఎరువులను అక్రమంగా నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయించే వారిపై ఫిర్యాదు చేయడానికి వ్యవసాయ శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు 89777-41771 నంబరుకు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ ఫోన్‌ నెంబరు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5 వరకు అందుబాటులో ఉంటుందన్నారు.


ఇవి కూడా చదవండి
యూట్యూబ్‌లో ఆ వీడియోలపై ఆదాయం రద్దు.. కొత్త రూల్స్

ఎయిర్ పోర్టులో 10వ తరగతితో ఉద్యోగాలు..లాస్ట్ డేట్ ఎప్పుడంటే

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 19 , 2025 | 04:14 AM