Nagarjuna Sagar,: సాగర్ స్పిల్‌వే మరమ్మతులకు శాశ్వత ఏర్పాట్లు
ABN , Publish Date - Feb 17 , 2025 | 01:49 AM
ఈ మేరకు ఆదివారం టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించారు.

అటూ ఇటూ కదిలే తరహా క్రేన్లకు నీటిపారుదల టెండర్లు
మార్చి 7లోగా ఆన్‌లైన్‌లో దాఖలుకు గడువు
నాగార్జునసాగర్, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): నాగార్జునసాగర్ ప్రాజెక్టు స్పిల్‌వే మరమ్మతులకు అటూ ఇటూ కదిలే తరహా క్రేన్‌ను ఏర్పాటు చేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆదివారం టెండర్ నోటిఫికేషన్ విడుదలైంది. అంతర్జాతీయ కంపెనీల నుంచి టెండర్లు ఆహ్వానించారు. మార్చి 7వ తేదీ సాయంత్రం 4 గంటల్లోగా ఆన్‌లైన్‌లో టెండర్లు వేయాలని ప్రాజెక్టు ఎస్‌ఈ శ్రీధర్‌రావు కోరారు. అంతర్జాతీయ కంపెనీలకు చెందిన కాంట్రాక్టర్లు స్వయంగా సాగర్ ప్రాజెక్ట్ స్పిల్‌వేను సందర్శించి, మరమ్మతులకు ఎటువంటి క్రేన్ ఉపయోగపడుతుందో చూసుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు సాగర్ ప్రాజెక్టు స్పిల్‌వే గుంతలను పూడ్చేందుకు టెండర్లను పిలుస్తున్నారు. ఆ తర్వాత స్పిల్‌వే ముందు భాగంలో రోడ్డు వేయడం, నీటిని ఎత్తిపోయడం వంటి పనులు చేపడుతున్నారు. దీంతో మరమ్మతు పనులు ఆలస్యమవుతున్నాయి. ఇకనుంచి అలా జరగకుండా ఉండేందుకు శాశ్వతంగా కదిలే క్రేన్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Also Read:
గుడ్ న్యూస్.. డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడో చెప్పేసిన చంద్రబాబు..
భారీ స్కామ్.. పెట్టుబడుల పేరుతో రూ.850 కోట్లకు..
For More National News and Telugu News..