Share News

Bala Saraswati: గాయని బాల సరస్వతి కన్నుమూత

ABN , Publish Date - Oct 15 , 2025 | 01:53 PM

తెలుగులో తొలి నేపథ్య గాయని బాల సరస్వతి(97) మృతి చెందారు. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసు ఉన్నప్పటినుంచే బాల సరస్వతి పాటలు పాడడం మొదలుపెట్టారు.

Bala Saraswati: గాయని బాల సరస్వతి కన్నుమూత
Bala Saraswati

హైదరాబాద్, అక్టోబర్ 15: తెలుగులో తొలి నేపథ్య గాయని బాల సరస్వతి(97) మృతి చెందారు. హైదరాబాద్‌లో ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆరేళ్ల వయసు ఉన్నప్పటినుంచే బాల సరస్వతి పాటలు పాడడం మొదలుపెట్టారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీతో పాటు పలు భాషల్లో మొత్తం 2000కి పైగా ఆమె పాటలు పాడారు.


లలిత సంగీత దిగ్గజంగా పేరుందిన బాల సరస్వతి దేవి 1939లో మహానంద సినిమాతో తెలుగులో తొలి నేపధ్య గాయనిగా గుర్తింపు పొండారు. ఆకాశవాణి కార్యక్రమంతో తెలుగు వారికి పరిచయమైన బాల సరస్వతి.. ‘సతీ అనసూయ’ సినిమాలో తొలి పాటను పాడారు. తెలుగు చిత్ర పరిశ్రమ తొలి దశలో అనేక మధుర గీతాలు ఆలపించారు. తెలుగు, తమిళ సినిమాల్లో 1930 నుంచి 1960 వరకు పాటలు పాడటంతో పాటు పలు చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు.


ఇవి కూడా చదవండి:

Kamareddy Accident: కామారెడ్డిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్..

KTR: అభివృద్ధి పాలనకు, అరాచక పాలనకు జరుగుతున్న ఉపఎన్నిక: కేటీఆర్

Updated Date - Oct 15 , 2025 | 02:02 PM