నీటిపారుదలశాఖలో పదోన్నతులకు రంగం సిద్ధం
ABN , Publish Date - Jan 26 , 2025 | 05:07 AM
చీఫ్ ఇంజనీర్ (సీఈ) నుంచి ఈఎన్‌సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్)లుగా పదోన్నతి కల్పించే ఫైలు శనివారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి వద్దకు చేరగా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) నుంచి చీఫ్ ఇంజనీర్(సీఈ)ల పదోన్నతుల ఫైలు సాధారణ పరిపాలనశాఖకు చేరింది.
సీనియారిటీ జాబితాను పంపాలని ప్రభుత్వం ఆదేశం
హైదరాబాద్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): నీటిపారుదలశాఖలో భారీగా పదోన్నతులకు రంగం సిద్ధమయింది. చీఫ్ ఇంజనీర్ (సీఈ) నుంచి ఈఎన్‌సీ (ఇంజనీర్ ఇన్ చీఫ్)లుగా పదోన్నతి కల్పించే ఫైలు శనివారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి వద్దకు చేరగా సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) నుంచి చీఫ్ ఇంజనీర్(సీఈ)ల పదోన్నతుల ఫైలు సాధారణ పరిపాలనశాఖకు చేరింది.
ఇక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (డీఈఈ)లుగా పదోన్నతి కల్పించడానికి వీలుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ర్యాంకులు, మార్కుల ఆధారంగా సమీకృత సీనియారిటీ లిస్టును పంపాలని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రాహుల్ బొజ్జా శనివారం ఈఎన్‌సీకి ఆదేశాలు జారీ చేశారు. రెండు రోజులోసీనియారిటీ జాబితాను ప్రభుత్వానికి పంపించే అవకాశాలున్నాయి.
ఇవీ చదవండి:
క్రికెట్ చరిత్రలో సంచలనం.. 73 ఏళ్ల ఆల్‌టైమ్ రికార్డు బ్రేక్
రంజీ ట్రోఫీ.. రోహిత్ టీమ్ ఘోర ఓటమి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి