Water Resources Department: నీటి పారుదలలో సాదాసీదాగా పదోన్నతులు పూర్తి
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:47 AM
రాష్ట్ర నీటి పారుదలశాఖలో అత్యంత కీలకమైన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)లుగా పదోన్నతులు, పోస్టింగ్ ప్రక్రియ సాదాసీదాగా జరిగిపోయింది.
47 మంది ఈఈలకు ఎస్‌ఈలుగా ప్రమోషన్
123మంది ఏఈఈలకు డీఈఈలుగా పదోన్నతి
ప్రమోషన్ల ఫైలుపై మంత్రి ఉత్తమ్ సంతకం
హైదరాబాద్, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర నీటి పారుదలశాఖలో అత్యంత కీలకమైన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ (ఎస్‌ఈ)లుగా పదోన్నతులు, పోస్టింగ్ ప్రక్రియ సాదాసీదాగా జరిగిపోయింది. పైరవీలూ అవినీతికి ఆస్కారం లేకుండా 47 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల (ఈఈ)కు ఎస్‌ఈలుగా పదోన్నతి కల్పించి, పోస్టింగ్ ఇస్తూ సర్కారు నిర్ణయం తీసుకున్నది. వీరితోపాటు 123 మంది అసిస్టెంట్ ఇంజనీర్లకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర నీటి పారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నీటి పారుదలశాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతోనే ఇది సాధ్యమైందని అధికారులు గుర్తు చేశారు. ఈఈలకు ఎస్‌ఈలుగా పదోన్నతి కల్పించడంతోపాటు పోస్టింగ్ ఇచ్చే ఫైలుపై మంత్రి ఉత్తమ్ సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 3 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత తమ శాఖలో పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేశామని చెప్పారు.
అంతరాష్ట్ర జలవనరుల విభాగం ఎస్‌ఈగా ఆకెళ్ల సురేష్
అంతరాష్ట్ర జలవనరుల విభాగం ఎస్‌ఈగా ఆకెళ్ల సురేశ్‌ను,. రామగుండం ఎస్‌ఈగా ఎ.వి.వి.ఎ్‌స.నర్సింహారావు, ఖమ్మం ఎస్‌ఈగా ఎం.వెంకటేశ్వర్లు, గజ్వేల్ ఎస్‌ఈగా లక్ష్మణ్, సిద్దిపేట ఎస్‌ఈగా డి.రవీందర్‌రెడ్డి, గోదావరి బోర్డు ఎస్‌ఈగా టి.ఎన్.ఎన్.రవికుమార్, కరీంనగర్ ఎస్‌ఈగా శ్రీనివాసరావు గుప్తా, పోచంపాడు ఎస్‌ఈగా జగదీశ్, సీఈ సీడీవోలో ఎస్‌ఈ-1గా ఎం.ఏ. జహీర్, బాన్సువాడ ఎస్‌ఈగా కె.దక్షిణమూర్తి, మెదక్ ఎస్‌ఈగా రఘునాథరావు, హైడ్రాలజీ ఎస్‌ఈగా ఆర్.వెంకట రమణ, సీవోటీ ఎస్‌ఈగా మీర్జా నజీర్ హుస్సేన్, డిప్యూటీ ఈఎన్‌సీ(జనరల్)గా కె.శ్రీనివాస్ తదితరులను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవి చూసి షాక్ అయ్యా: బండి సంజయ్
‘బీజేపీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు’
For More AndhraPradesh News And Telugu News