BC Reservation: ‘స్థానికం’లో బీసీలకు 42% రిజర్వేషన్లపై అసెంబ్లీలో నిర్ణయం
ABN , Publish Date - Aug 14 , 2025 | 04:08 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం మళ్లీ అసెంబ్లీకే చేరుకోనుంది. అసెంబ్లీ తీర్మానం ద్వారా బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.
తీర్మానం పెట్టి ఆమోదించే అవకాశం..
18 తర్వాత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఘోష్ కమిషన్ నివేదికపై శాసనసభ, మండలిలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్!
హైదరాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే అంశం మళ్లీ అసెంబ్లీకే చేరుకోనుంది. అసెంబ్లీ తీర్మానం ద్వారా బీసీలకు ఈ మేరకు రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. వాస్తవానికి విద్య, ఉద్యోగాలు.. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఆమోదించిన రెండు బిల్లులు, పంచాయతీరాజ్ ఎన్నికల్లో రిజర్వేషన్‌పై ఉన్న పరిమితిని ఎత్తివేస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్సు.. కేంద్రం వద్దనే పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే స్థానిక ఎన్నికల విషయంలో కోర్టు గడువు ముంచుకొస్తుండడంతో అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునేలా కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లుకు రాష్ట్ర స్థాయిలోనే చట్టబద్ధత తెచ్చే ఆలోచన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ ఆమోదం పొందిన ఈ బిల్లుకు చట్టబద్ధత కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానాన్ని చర్చకు పెట్టి ఆమోదించాలని, ఆ తీర్మానం ఆధారంగా ఉత్తర్వులూ జారీ చేయాలని ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏదిఏమైనా అసెంబ్లీ వేదికగా ఈ అంశంపై నిర్ణయం తీసుకునే పట్టుదలతో సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ అంశంపైన కాంగ్రెస్ పార్టీ పరంగా నిర్ణయం తీసుకునేందుకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) భేటీ నిర్వహించాలని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్‌ల భేటీలో నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న పీఏసీ భేటీ జరిగే అవకాశం ఉందని, ఆ భేటీలో మరింత స్పష్టత రానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
18 తర్వాత అసెంబ్లీ సమావేశాలు
ఈనెల 18వ తేదీ తర్వాత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సమావేశాలకు ముందు మంత్రివర్గం భేటీయైు.. అసెంబ్లీలో ఆమోదించాల్సిన బిల్లులు, ఇతర అంశాలపైన చర్చించి ఆమోద ముద్ర వేయనుంది. బీసీలకు 42ురిజర్వేషన్లతో పాటుగా మరోకీలక అం శంపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఇటీవల ప్రభుత్వానికి విచారణ నివేదిక ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నివేదికను పరిశీలించిన మంత్రివర్గం.. అసెంబ్లీలోనూ చర్చకు పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా శాసనసభ, మండలిలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. మరోవైపు.. ఈ అసెంబ్లీ సమావేశాల నుంచి శాసన మండలిని పాత అసెంబ్లీ సమావేశ మందిరంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 17 లేదా 18న సీఎం ఏర్పాట్లను పరిశీలించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోనియా గాంధీ లక్ష్యంగా సంచలన ఆరోపణలు..
రిమాండ్ పొడిగింపు.. కోర్టు వద్ద చెవిరెడ్డి హల్‌చల్
Read latest Telangana News And Telugu News