Jupally Krishnarao: రియో కార్నివాల్ తరహాలో రాష్ట్రంలోనూ అంతర్జాతీయ వేడుక
ABN , Publish Date - Jul 23 , 2025 | 06:50 AM
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్ తరహాలో.. తెలంగాణలో అంతర్జాతీయ..
ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించండి
అధికారులకు మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశం
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రియో కార్నివాల్ తరహాలో.. తెలంగాణలో అంతర్జాతీయ కార్నివాల్ నిర్వహణకు ప్రతిపాదనలు, ప్రణాళికలు రూపొందించాలని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కార్యాలయంలో మంగళవారం సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్, సంస్థ ఎండీ వల్లూరు క్రాంతి తదితర అధికారులతో సమావేశమై రాష్ట్రంలో పర్యాటక ప్రగతి కా ర్యాచరణపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రదేశంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి