Share News

Telangana TET Results: టెట్‌ ఫలితాలు విడుదల

ABN , Publish Date - Jul 23 , 2025 | 06:04 AM

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్‌ జూన్‌ 2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.

Telangana TET Results: టెట్‌ ఫలితాలు విడుదల

  • 90,205 మంది పరీక్షకు హాజరుకాగా 30,649 మంది పాస్‌

  • టెట్‌లో 34 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్‌, జూలై 22(ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) జూన్‌-2025 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. పాఠశాల విద్య సంచాలకుల కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, సంచాలకులు నవీన్‌ నికోలస్‌ ఫలితాలను విడుదల చేశారు. జూన్‌ 18-30 తేదీల మధ్య మొత్తం 16 సెషన్లలో ఈ పరీక్ష జరిగింది. పేపర్‌ 1, 2 కలిపి మొత్తం 90,205 మంది హాజరవ్వగా 30,649 (33.98%) మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్‌-1లో మొత్తం 47,224 మంది హాజరవగా 29,043 (61.50%) అర్హత సాధించారు. వీరిలో 511 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. అలాగే పేపర్‌-2 గణితశాస్త్రం, సైన్స్‌ రాసిన 48,998 మందిలో 17,574 (35.87%) ఉత్తీర్ణత సాధించగా వారిలో 988 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. సాంఘికశాస్త్రం పరీక్షకు మొత్తం 41,207 మంది హాజరవగా 13,075 (31.73%) మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 511 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. పేపర్‌-1 మొత్తం ఏడు భాషల్లో నిర్వహించగా అత్యధికంగా తెలుగు మాధ్యమంలో 58,977 మంది, ఉర్దూలో 3,348 మంది, హిందీలో 743 మంది, మరాఠీలో 103 మంది, కన్నడలో 79 మంది, బెంగాలీలో ఆరుగురు, తమిళ మాధ్యమంలో ఐదుగురు పరీక్ష రాశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 06:04 AM