Kaleshwaram Project: కేంద్రానికే కాళేశ్వరం పరీక్షల బాధ్యత
ABN , Publish Date - May 20 , 2025 | 04:05 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై పరీక్షలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.
లేఖ రాసిన రాష్ట్ర నీటి పారుదలశాఖ
హైదరాబాద్, మే 19 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై పరీక్షలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ సిఫారసులకనుగుణంగా భూ సాంకేతిక (జియో టెక్నికల్), భూ భౌతిక (జియో ఫిజికల్) పరీక్షల నిర్వహణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీలోని సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ (సీఎ్‌సఎంఆర్‌ఎస్- ఢిల్లీ)కు, పుణెలోని కేంద్ర విద్యుత్, నీటి పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్‌ఎ్‌స)లకు రాష్ట్ర ప్రభుత్వ నీటి పారుదల శాఖ అధికారులు లేఖ రాశారు.
మేడిగడ్డలో పరీక్షల కోసం సీఎ్‌సఎంఆర్‌ఎ్‌సకు, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పరీక్షలకు సీడబ్ల్యూపీఆర్‌ఎస్) లను కోరారు. ఈ పరీక్షల నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో తెలియచేస్తే వెనువెంటనే నిధులు ఇస్తామని పేర్కొన్నారు. బ్యారేజీలపై పరీక్షలు, అధ్యయనాల నివేదికల ఆధారంగా వాటి పునరుద్ధరణ / మరమ్మత్తు ప్రణాళికలకు కేంద్ర జల వనరుల సంఘం (సీడబ్లూసీ) ఆమోదం తీసుకోవాలని ఎన్‌డీఎ్‌సఏ దిశా నిర్దేశం చేసిన నేపథ్యంలో పరీక్షల నిర్వహణ బాధ్యత కూడా కేంద్ర సంస్థలకే తెలంగాణ నీటి పారుదలశాఖ అప్పగించింది.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News