Share News

19 ఖనిజ బ్లాకుల వేలంతో రూ.56.74 కోట్ల రాబడి

ABN , Publish Date - May 29 , 2025 | 05:13 AM

రాష్ట్రంలోని 19 చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం ద్వారా రూ.56.74 కోట్ల రాబడి సమకూరిందని గనులు, భూగర్భ వనరుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

19 ఖనిజ బ్లాకుల వేలంతో రూ.56.74 కోట్ల రాబడి

  • పారదర్శకంగా వేలం ప్రక్రియ: గనుల శాఖ

హైదరాబాద్‌, మే 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 19 చిన్న తరహా ఖనిజ బ్లాకుల వేలం ద్వారా రూ.56.74 కోట్ల రాబడి సమకూరిందని గనులు, భూగర్భ వనరుల శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత సహజ వనరుల లీజు విధానంలో పారదర్శకతను పాటించడానికి రాష్ట్ర ప్రభుత్వం మార్చి 10 నుంచి ఈ-వేలం విధానాన్ని అమల్లోకి తెచ్చిందని వెల్లడించింది. ఈ నెల 23 నుంచి 27 వరకు 19 చిన్న ఖనిజ బ్లాకుల వేలం ప్రక్రియ ను పూర్తి చేశామని స్పష్టం చేసింది.


సాంకేతిక మూల్యాంకన కమిటీ ఏర్పాటు, ఈ-వేలం ప్రొవైడర్‌ ఎంపిక, డిపాజిట్ల చెల్లింపు డిజిటలైజేషన్‌, వేలంపై విస్తృత ప్రచారం కల్పించ డం.. వికారాబాద్‌, సిద్దిపేట, కరీంనగర్‌, రంగారెడ్డి జిల్లాల్లో అవగాహన శిబిరాల నిర్వహణ వంటి చర్యలు తీసుకోవడం ద్వారా పూర్తి పారదర్శకంగా సంస్థలను ఎంపిక చేశామని వివరించింది. మొదటి విడతలో వచ్చిన విశేష స్పందనతో ఇకపై ప్రతి నెలా విడతల వారీగా గనుల వేలం నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ శాఖ పేర్కొంది.


Also Read:

వావ్.. రైలు పట్టాల మీద జేసీబీ

రైతులకు కేంద్రం గుడ్‌న్యూస్

తెలంగాణ హైకోర్టు కొత్త సీజే ఎవరంటే

For More Telangana News and Telugu News..

Updated Date - May 30 , 2025 | 02:56 PM