TG Police: TG Police: పోలీస్ శాఖలో సరికొత్త సేవలు.. ఇంటి వద్దనే ఎఫ్‌ఐఆర్
ABN , Publish Date - Aug 08 , 2025 | 07:39 AM
ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు సరికొత్త సేవలను గురువారం ప్రారంభించారు. బాలానగర్ పీఎస్ పరిధిలో ఫిర్యాదు దారుల ఇంటివద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
- బాలానగర్ పీఎస్ పరిధిలో ప్రయోగాత్మకంగా ప్రారంభం
హైదరాబాద్: ప్రజలకు మరింత చేరువ కావాలనే లక్ష్యంతో సైబరాబాద్ కమిషనరేట్(Cyberabad Commissionerate) పోలీసులు సరికొత్త సేవలను గురువారం ప్రారంభించారు. బాలానగర్ పీఎస్(Balanagar PS) పరిధిలో ఫిర్యాదు దారుల ఇంటివద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాలానగర్ ఎస్‌హెచ్‌వో నరసింహరాజు, ఎస్‌ఐలు సరితాపటేల్ రెడ్డి, వినోద్ హనుమాన్ దేవాలయం, పట్వారి ఎన్‌క్లేవ్, కామాక్షి ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌ల వద్దకు వెళ్లి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు ఫిర్యాదు దారుల ఇళ్ల వద్దకు రావడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

పోలీసులపై నమ్మకం కలిగేలా చర్యలు పోలీసులపై మరింత నమ్మకం కలిగేలా చర్యలు తీసుకుంటున్నాం. బాధితుల ఇళ్ల వద్దకు వెళ్లి ఫిర్యాదులు తీసుకోవడంతోపాటు కాపీని వారికి అందజేస్తాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.
- నరసింహరాజు,
బాలానగర్ ఎస్‌హెచ్‌వో
ఈ వార్తలు కూడా చదవండి..
ఆల్‌టైం గరిష్ఠానికి పసిడి ధరలు.. ఎంతకు చేరుకున్నాయంటే..
ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అరుదైన గుర్తింపు
Read Latest Telangana News and National News