తెలంగాణకు 21 సేవా పతకాలు
ABN , Publish Date - Jan 26 , 2025 | 04:13 AM
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవా పతకాలలో తెలంగాణకు 21, ఆంధ్రప్రదేశ్‌కు రెండు పతకాలు లభించాయి.
ఇద్దరు పోలీసు అధికారులకు రాష్ట్రపతి విశిష్టసేవా పతకాలు
12 మందికి ప్రతిభసేవా పతకాలు
న్యూఢిల్లీ, హైదరాబాద్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర హోంశాఖ ప్రకటించిన సేవా పతకాలలో తెలంగాణకు 21, ఆంధ్రప్రదేశ్‌కు రెండు పతకాలు లభించాయి. శనివారం దేశవ్యాప్తం గా పోలీస్, ఫైర్ సర్వీస్, హోంగార్డ్ అండ్ సివిల్ డిఫెన్స్, కరెక్షనల్ సర్వీ్‌సలకు చెందిన 942 మంది సిబ్బందికి కేంద్ర హోంశాఖ శౌర్య, సేవా పతకాలను ప్రకటించింది. వీరిలో 95 మందికి శౌర్య పతకాలు (గ్యాలెంట్రీ మెడల్స్), 101 మందికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, 746 మందికి ప్రతిభా సేవా పతకాలు (మెడల్స్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్) లభించాయి. తెలంగాణ పోలీస్ శాఖలో ఉత్తమ సేవలకు గాను ఇద్దరికి రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు, మరో 12 మందికి ప్రతిభా సేవా పతకాలు దక్కాయి. హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీ మెట్టు మాణిక్ రాజ్‌కు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకాలు లభించాయి.
కార్తికేయ(ఐజీ), అన్నల ముత్యంరెడ్డి(ఎస్పీ), కమల రాం కుమార్(డీసీపీ), మహమ్మద్ ఫజ్లుర్ రెహమాన్(డీఎస్పీ), కోటపాటి వెంకట రమణ(డీఎస్పీ), అన్ను వేణుగోపాల్(డీఎస్పీ), అనుమల నిరంజన్‌రెడ్డి(ఇన్‌స్పెక్టర్), ఏఎ్‌సఐలు రణవీర్ సింగ్ ఠాకూర్, పీటర్ జోసెఫ్ బహదూర్, మహ్మద్ మొ యినుల్లాఖాన్, హెడ్ కానిస్టేబుళ్లు వడ్త్య పత్యానాయక్, ఎండీ అయూబ్ ఖాన్‌లకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. ఫైర్ సర్వీస్ విభాగంలో తెలంగాణలో అగ్నిమాపక సిబ్బందిగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావు మోరుబోయిన, సుబ్బయ్య చావల, జనార్దన్ కారుకూరికి, హోంగార్డ్ అండ్ సివిల్ ఢిపెన్స్ విభాగంలో హోంగార్డులు ఈశ్వరయ్య మంత్రి, యాదగిరి మేడిపల్లి, లక్ష్మణ్ కోమటి, ఐలయ్య కల్లెంలకు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. కాగా, కరెక్షనల్ సర్వీస్ విభాగంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడలి అర్జునరావు(చీఫ్ హెడ్ వార్డర్), వీరవెంకట సత్యనారాయణ ఉండ్రాజవరపు(వార్డర్)కు ప్రతిభా సేవా పతకాలు లభించాయి. మధ్యప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన తెలుగు వ్యక్తి, సీబీఐ జాయింట్ డైరక్టర్‌గా ఉన్న దాట్ల శ్రీనివాస వర్మకు రాష్ట్రపతి విశిష్ట సేవా పతకం లభించింది. పతకాలు సాధించిన పోలీసులకు డీజీపీ జితేందర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఇద్దరు ఆర్పీఎఫ్ అధికారులకు రాష్ట్రపతి పతకాలు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి) : దక్షిణమధ్య రైల్వే రక్షణ దళంలో పనిచేస్తున్న ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి పతకాలు లభించాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని విశిష్ట సేవలందించిన సికింద్రాబాద్ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ దొంతగాని శ్రీనివాసరావు, మౌలాలి శిక్షణ కేంద్రం అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ పుత్తూరు రవిచంద్రన్‌లను ఈ పతకాలకు ఎంపిక చేశారు.
