Hyderabad: 25 ఏళ్ల వరకు నో డ్రైవింగ్ లైసెన్స్.. మైనర్లు దొరికారంటే జరిగేది ఇదే..
ABN , Publish Date - May 03 , 2025 | 04:22 PM
మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. డ్రైవింగ్ చేస్తూ దొరికిన మైనర్ల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ తప్పనిసరి అంటున్నారు. అంతేకాకుండా..
హైదరాబాద్: భారతదేశంలో 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తులు వాహనం నడపడం చట్టవిరుద్ధం. మైనర్లు డ్రైవింగ్ చేస్తూ చిక్కితే కఠిన చర్యలు తప్పవని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే దొరికితే తల్లిదండ్రులు లేదా వాహన యజమానులకు ఏడాది పాటు లైసెన్స్ సీజ్ చేయడంతో పాటు భారీగా జరిమానా, జైలు శిక్ష కూడా ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. అంతేకాకుండా 25 ఏళ్ల వయసు వచ్చే వరకు మైనర్ డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి అవకాశం ఉండదు.
1988 మోటారు వాహనాల చట్టం ప్రకారం,18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారు వాహనం నడపడం కరెక్ట్ కాదు. మైనర్ డ్రైవింగ్ చేస్తే వాహనం రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయవచ్చు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి అధికారులు ఈ కఠిన చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా, మైనర్ల డ్రైవింగ్‌ను ప్రోత్సహించకుండా తల్లిదండ్రులు బాధ్యత వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.
Also Read:
Copper Vessel Benefits: రాగి పాత్రల్లో నీరు తాగితే 7 అద్భుతమైన ప్రయోజనాలు
Janu Lyri: రెండో పెళ్లి కన్ఫార్మ్ చేసిన జాను లిరి.. అతడి ఫొటో షేర్ చేసి మరీ..
Kannada News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కర్రీ, సాంబార్ సరిగా చేయలేదని..