Kannada News: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. కర్రీ, సాంబార్ సరిగా చేయలేదని..
ABN , Publish Date - May 03 , 2025 | 03:20 PM
Kannada News: శక్తిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. అయితే, కర్రీ, సాంబార్ కోసం ఈ హత్య జరగలేదని పోలీసులు భావిస్తున్నారు.
తినే తిండికోసం ఓ వ్యక్తి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను చంపేశాడు. అది కూడా కర్రీ, సాంబార్ సరిగా లేదని ఆమెను పొట్టన పెట్టుకున్నాడు. ఈ సంఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిసిన వివరాల మేరకు.. కర్ణాటక, బాగల్కోట్ జిల్లా, ముగలఖోడకు చెందిన బీరప్ప పూజారీ కొన్నేళ్ళ క్రితం బెల్గాం జిల్లా, వాడగోల గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉండి చదువుకుంటూ ఉండేవాడు. అక్కడ అతడికి శక్తిత అనే యువతితో పరిచయం అయింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది.
వీరి ప్రేమ సంగతి ఇంట్లో వాళ్లకు తెలిసింది. ఒకే కులానికి చెందిన వారు కావటంతో వీరి పెళ్లికి ఇరు కుటుంబాల వారు ఒప్పుకున్నారు. గత సంవత్సరం వీరి పెళ్లి ఘనంగా జరిగింది. అప్పటినుంచి వీరిద్దరూ ముగలఖోదలోనే ఉంటున్నారు. పెళ్లయిన కొన్ని నెలల పాటు ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. తర్వాతి నుంచి ఇద్దరి మధ్యా చిన్న చిన్న గొడవలు అవుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 29వ తేదీన కర్రీ, సాంబార్ విషయంలో భార్యా భర్తల మధ్య గొడవ మొదలైంది. కర్రీ, సాంబార్ సరిగా లేదని బీరప్ప భార్యను తిట్టాడు. దీంతో గొడవ మొదలైంది.
ఆ గొడవ కొద్ది సేపటికే తారాస్థాయికి చేరింది. భార్య మాటకు మాట సమాధానం చెప్పటంతో బీరప్ప తట్టుకోలేకపోయాడు. ఆమెను కిందపడేసి గుండెలపై కూర్చొన్నాడు. తర్వాత గొంతు నులిమి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. శక్తిత మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. అతడ్ని విచారిస్తున్నారు. అయితే, కర్రీ, సాంబార్ కోసం ఈ హత్య జరగలేదని పోలీసులు భావిస్తున్నారు. బీరప్పకు వేరే మహిళలతో సంబంధం ఉన్నట్లు సమాచారం అందింది. ఈ కారణంతో ఇద్దరికీ గొడవ అయినట్లు తెలుస్తోంది. అన్ని కోణాల్లోంచి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి
ముగ్గురు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య.. పోలీసులకు దొరికిన లేఖ..
Chanakya Niti About Family: కుటుంబ పెద్దకు ఈ లక్షణాలు లేకపోతే కుటుంబం చెల్లాచెదురుగా ఉంటుంది..