Share News

Sand Markets: నాలుగు ఇసుక బజార్ల ద్వారా నాణ్యమైన ఇసుక

ABN , Publish Date - Jul 11 , 2025 | 04:32 AM

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల ప్రజల కోసం నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించామని, అవసరమైనవారు వీటి నుంచి నాణ్యమైన ఇసుకను కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) ఓ ప్రకటనలో తెలిపింది.

Sand Markets: నాలుగు ఇసుక బజార్ల ద్వారా నాణ్యమైన ఇసుక

  • కావాలసినవారు కొనుగోలు చేసుకోవచ్చు: టీజీఎండీసీ

హైదరాబాద్‌, పరిసర ప్రాంతాల ప్రజల కోసం నాలుగు ఇసుక బజార్లను ప్రారంభించామని, అవసరమైనవారు వీటి నుంచి నాణ్యమైన ఇసుకను కొనుగోలు చేసుకోవాలని తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ(టీజీఎండీసీ) ఓ ప్రకటనలో తెలిపింది. వట్టినాగులపల్లి, అబ్దుల్లాపూర్‌మెట్‌, బౌరంపేట, ఆదిభట్లలో ఇసుక బజార్లను ఏర్పాటు చేశామని పేర్కొంది. ఈ బజార్లలో టన్ను సన్న ఇసుక రూ.1800కు, దొడ్డు ఇసుక రూ.1600కు విక్రయిస్తున్నామని తెలిపింది.


వ్యక్తిగత వినియోగదారులు, కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలవారు తమ అవసరాల కోసం టీజీఎండీసీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా బుక్‌ చేసుకుని ఇసుకను తీసుకుపోవచ్చని వివరించింది. ఇతరత్రా సందేహాల కోసం టీజీఎండీసీ హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 155242కు ఈ-మెయిల్‌ చేయాలని టీజీఎండీసీ సూచించింది.


ఈ వార్తలు కూడా చదవండి.

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

గొంతు నొప్పిని తగ్గించే సింపుల్ చిట్కా..

ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర మంత్రి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 11 , 2025 | 04:32 AM