Tirumala Visit: శీవారి సేవలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి
ABN , Publish Date - May 05 , 2025 | 04:01 AM
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీవీ వేణుగోపాల్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ధ్వజస్తంభానికి మొక్కిన ఆయన, గర్భాలయంలో మూలవిరాట్టును దర్శించుకొని, వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు
తిరుమల, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీవీ వేణుగోపాల్ ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయంలోకి వెళ్లిన ఆయన ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని తర్వాత గర్భాలయంలోని మూలవిరాట్టును దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపానికి చేరుకున్న జస్టి్‌సకు వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.