Share News

High Court: బీఆర్‌ఎస్‌ నల్లగొండ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి

ABN , Publish Date - Jan 23 , 2025 | 04:15 AM

రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ నల్గొండలో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది.

High Court: బీఆర్‌ఎస్‌ నల్లగొండ రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతి

  • 28న 1500 మందితో శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆదేశం

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులను మోసం చేసిందంటూ నల్గొండలో బీఆర్‌ఎస్‌ తలపెట్టిన రైతు మహాధర్నాకు హైకోర్టు అనుమతిచ్చింది. ఈనెల 28న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 1500 మందితో శాంతియుతంగా ధర్నా నిర్వహించుకోవచ్చని పేర్కొంది. రైతు భరోసా రూ. 15 వేలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ. 12 వేలకు తగ్గించడంపై బీఆర్‌ఎస్‌ నల్గొండలో ధర్నా తలపెట్టగా పోలీసులు అనుమతి నిరాకరించారు.


దీంతో బీఆర్‌ఎస్‌ నల్గొండ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం ధర్నాకు అనుమతిస్తూ.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా నిర్వహించుకోవాలని సూచించింది.


ఇవి కూడా చదవండి..

BRS.. దివ్యంగుడైన ఓ మాజీ ఎమ్మెల్యేకే రక్షణ లేదు: కేటీఆర్

Hyderabad: గ్రేటర్‌లో రాత్రివేళల్లో పెరిగిన ‘చలి’

Updated Date - Jan 23 , 2025 | 04:15 AM