Share News

TG Govt: నవంబర్‌ కోటా రేషన్‌ బియ్యం రెడీ..

ABN , Publish Date - Nov 01 , 2025 | 07:27 AM

నవంబరు నెలకు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీకి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. బియ్యం స్టాకును రేషన్‌ షాపులకు తరలించామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌ తెలిపారు.

TG Govt: నవంబర్‌ కోటా రేషన్‌ బియ్యం రెడీ..

- నేటి నుంచి 17,102 టన్నుల సన్న బియ్యం పంపిణీ

హైదరాబాద్‌ సిటీ: నవంబరు నెలకు సంబంధించిన రేషన్‌ బియ్యం పంపిణీకి జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. బియ్యం స్టాకును రేషన్‌ షాపులకు తరలించామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి శ్రీనివాస్‌(Srinivas) తెలిపారు. జిల్లా పరిధిలో మొత్తం 7,98,269 రేషన్‌కార్డులు ఉన్నాయన్నారు. ఈ కార్డుల ద్వారా మొత్తం 30,42,056 మంది లబ్దిదారులు జిల్లా పరిధిలో ఉన్నారు.


city2.2.jpg

నవంబరు నెలకు సంబంధించి పంపిణీ చేయాల్సిన కోటా 17,102 టన్నుల సన్న బియ్యాన్ని గోడౌన్‌లలో సిద్ధంగా ఉంచారని, మొదటి విడతగా 8,500 టన్నుల బియ్యాన్ని నగరవ్యాప్తంగా 653 రేషన్‌ షాపులకు పంపించామని తెలిపారు. సన్నం బియ్యంతో పాటు జీహెచ్‌ఎంసీ పరిధిలో గోధుమలను రేషన్‌ కార్డుల ద్వారా పంపిణీ చేస్తున్నామని, ఈనెల కోటా 3,400 టన్నులు కేటాయించామని తెలిపారు.


city2.3.jpg

ఈ వార్తలు కూడా చదవండి..

డిగ్రీ విద్యార్థిని అనుమానాస్పద మృతి

నాలాల కబ్జాలను ఉపేక్షించొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 01 , 2025 | 07:27 AM