Share News

Kaleshwaram Projectఫ కాళేశ్వరం కింద సాగునీరు 45 వేల ఎకరాలకే..

ABN , Publish Date - Jul 12 , 2025 | 04:14 AM

ఖరీఫ్‌‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 44, 570 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 39,320 ఎకరాలు ఆరుతడి పంటలు కాగా... 5,250 ఎకరాల వరి పంటకు నీళ్లివ్వనున్నారు.

Kaleshwaram Projectఫ కాళేశ్వరం కింద సాగునీరు 45 వేల ఎకరాలకే..

  • 39,320 ఎకరాలు ఆరుతడి పంటలు.. 5,250 ఎకరాలు వరి

  • కృష్ణా, గోదావరి బేసిన్‌ పరిధిలో 38.76 లక్షల ఎకరాలకు..

  • కృష్ణా పరిధిలో 17.68 లక్షల ఎకరాలకు నీళ్లు.. స్కైవమ్‌ నిర్ణయం

హైదరాబాద్‌, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఖరీఫ్‌‌లో కాళేశ్వరం ప్రాజెక్టు కింద 44, 570 ఎకరాలకు సాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో 39,320 ఎకరాలు ఆరుతడి పంటలు కాగా... 5,250 ఎకరాల వరి పంటకు నీళ్లివ్వనున్నారు. 2025-26 సంవత్సరానికి గాను ఖరీ్‌ఫలో నీటి విడుదలపై ఈఎన్‌సీ(జనరల్‌) మహ్మద్‌ అంజద్‌ అధ్యక్షతన జలసౌధలో స్కైవమ్‌(రాష్ట్రస్థాయి సాగునీటి విడుదల ప్రణాళిక కమిటీ) శుక్రవారం సమావేశమయింది. కృష్ణా, గోదావరి బేసిన్‌ పరిధిలోని భారీ, మధ్య తరహా ప్రాజెక్టులతో పాటు చిన్న లిఫ్టుల కింద 12,.04 లక్షల ఎకరాల ఆరుతడి పంటలకు, 26.71 లక్షల ఎకరాల్లో వరి పంటకు కలిపి.. మొత్తం 38.76 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు.


దీనికోసం 339.11 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. కృష్ణా బేసిన్‌ పరిధిలోని అన్ని జలాశయాల్లో పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నందునా.. 7.38 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు, 10. 30 లక్షల ఎకరాల్లో వరి పంటకు కలిపి 17.68 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని కమిటీ నిర్ణయించింది. ఇక గోదావరి బేసిన్‌ పరిధిలోని శ్రీరాంసాగర్‌, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌మానేరు వంటి ప్రాజెక్టుల్లో నీటి నిల్వ లేనందునా.. నీటి నిల్వ ఉన్న ప్రాజెక్టుల నుంచి 6.37 లక్షల ఎకరాలకు సాగునీటిని అందించాలని నిర్ణయించారు. మరో వారం రోజుల్లో దీని కోసం స్కైవమ్‌ కమిటీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఇక వానాకాలంలో గోదావరి బేసిన్‌ పరిధిలో 62.52 టీఎంసీలు, కృష్ణా బేసిన్‌ పరిధిలో 196.41 టీఎంసీలు సాగునీటి కోసం వినియోగించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌ లక్ష్యంగా ఉగ్రవాద దాడులు..!

అసెంబ్లీకి కాదు.. జనాల్లోకి రావడం లేదు

For Telangana News And Telugu News

Updated Date - Jul 12 , 2025 | 04:14 AM