Ponnam Prabhakar: నిరుద్యోగుల కలలు నెరవేర్చేందుకు అన్ని శాఖల్లో నియామకాలు: పొన్నం
ABN , Publish Date - May 09 , 2025 | 03:23 AM
అన్ని వర్గాల పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని, నిరుద్యోగుల కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 8 (ఆంధ్రజ్యోతి): అన్ని వర్గాల పోరాటంతోనే తెలంగాణ సాధించుకున్నామని, నిరుద్యోగుల కలలు నెరవేర్చేందుకు ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ ఉద్యోగ నియామకాలు చేపడుతున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో 60వేలకు పైగా ఉద్యోగ నియామకపత్రాలు అందజేశామన్నారు. సమస్యలను అధిగమించి ఉద్యోగ నియామకాలను పూర్తి చేస్తున్నామని తెలిపారు.
గురువారం సచివాలయంలో సంక్షేమ వసతి గృహాల అధికారులు (హెచ్‌డబ్ల్యూవో)గా ఎంపికైన వారికి మంత్రి చేతులమీదుగా నియామకపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. నియామకపత్రాలు అందుకున్న 132 మంది సంక్షేమ వసతిగృహాల అధికారులు తమ వృత్తిలో ప్రత్యేక గౌరవా న్ని పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు మా ర్గదర్శకంగా నిలవాలని, హెచ్‌డబ్ల్యూవోలు నిబద్ధతతో పనిచేయాలన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News