Delhi Protest: ప్రత్యేక రైలులో ఢిల్లీకి!
ABN , Publish Date - Jul 29 , 2025 | 03:39 AM
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఢిల్లీ వేదికగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించింది.
ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులు అందులోనే ప్రయాణం
వీలైతే.. పలువురు మంత్రులు కూడా అదే రైలులో..
రాష్ట్రపతితో భేటీ తర్వాత పార్టీ అధిష్ఠానంతో చర్చించే అవకాశం
హైదరాబాద్, జూలై 28 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఢిల్లీ వేదికగా కేంద్రంపై ఒత్తిడి చేయాలని నిర్ణయించింది. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో ఢిల్లీలోనే ఉండి కేంద్రంతో సంప్రదింపులు జరపాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆగస్టు 6న జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేయాలని తీర్మానించింది. ఇందుకు ప్రత్యేక రైలులో ఢిల్లీ వెళ్లనున్నారు. ఎమ్మెల్యేలు, బీసీ సంఘాల నాయకులంతా ఆ ప్రత్యేక రైలులోనే వెళ్లే విఽధంగా ఏర్పాట్లు చేయనున్నారు.
వీలైతే మంత్రులు కూడా దానిలోనే వెళ్లనున్నట్టు తెలిసింది. క్యాబినెట్ సహా నాయకులంతా మూడు రోజులపాటు ఢిల్లీలోనే వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్ల పర్యవేక్షణకు బీసీ మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు రెండ్రోజుల ముందుగానే హస్తినకు వెళ్లనున్నారు. ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని సర్కారు భావిస్తోంది. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని నిర్ణయించింది. అలాగే, రాష్ట్రపతిని కలిసిన తర్వాత అదే రోజు పార్టీ అధిష్ఠానంతో కీలకంగా చర్చించనున్నారని తెలిసింది. అధిష్ఠానం సూచనల మేరకు రిజర్వేషన్ల అంశంపై ముందుకెళ్లనున్నట్టు సమాచారం.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణలో అమెరికా పాత్ర లేదు, మోదీకి ఫోన్ కాల్ రాలేదు
22 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్ పూర్తి చేశాం: రాజ్‌నాథ్
For More National News and Telugu News..