Transfers: ప్రత్యేక సందర్భాల్లోనే ఉద్యోగుల బదిలీలు
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:58 AM
ప్రభుత్వోద్యోగుల బదిలపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టతనిచ్చింది. ప్రత్యేక కేసులు మినహా అన్ని శాఖల్లోనూ సాధారణ బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది.
సాధారణ బదిలీలపై నిషేధమే.. స్పష్టత ఇచ్చిన సర్కారు
హైదరాబాద్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వోద్యోగుల బదిలపై రాష్ట్ర ప్రభుత్వం మరోమారు స్పష్టతనిచ్చింది. ప్రత్యేక కేసులు మినహా అన్ని శాఖల్లోనూ సాధారణ బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉంది. ఈ మేరకు ఉద్యోగుల బదిలీలపై స్పష్టతనిస్తూ.. రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా గురువారం అంతర్గత ఉత్తర్వులు జారీ చేశారు. 2024 ఆగస్టు ఒకటో తేదీ నుంచి సాధారణ బదిలీలపై నిషేధం విధిస్తూ గతేడాది జూలై 31న జీవో 87 జారీ చేసింది. దీని ప్రకారం ప్రత్యేక కేసుల్లో చేపట్టే బదిలీలకు ఆర్థికశాఖ అనుమతి అక్కర్లేదని, ఉన్నతాధికారులు చేపట్టొచ్చునన్న సర్కారు.. ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు తమ పరిధిలోని విభాగాధిపతులకు తగు సూచనలు జారీ చేయాలని ఆదేశించింది. పరిపాలనాపరమైన బదిలీలు చేపట్టాల్సి వస్తే, సంబంధిత మంత్రి, సీఎస్, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిలకు ఫైల్ పంపి సీఎం అనుమతి తీసుకోవాలని పేర్కొంది.
ప్రత్యేక కేసుల బదిలీలకు మార్గదర్శకాలు
పదోన్నతులు పొందిన వారికి ఖాళీ ఉన్న చోట పోస్టింగ్ ఇస్తూ బదిలీ చేయొచ్చు. అప్పటికే అక్కడ పని చేస్తున్న ఉద్యోగిని కదిలించరాదు.
కొన్ని ప్రభుత్వ స్కీమ్‌ల అమలుకు వెళ్లి, అవి రద్దయిన తర్వాత.. సొంత శాఖలకు రావాల్సిన వారు, పోస్టుల నుంచి రివర్టయిన వారు, సొంత శాఖలకు రీపాట్రియేట్ అయ్యేవారు, డిప్యూటేషన్లపై పని చేస్తున్న వారిని ప్రత్యేక బదిలీ చేయడానికీ క్లియర్ వేకెన్సీలుండాలి.
6 నెలలకు పైగా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్నవారిని క్లియర్ వెకెన్సీ ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వవచ్చు.
సాధారణ బదిలీల కోసం సీఎ్‌సకు టీజీఓల విజ్ఞప్తి
ఉద్యోగుల సాధారణ బదిలీలు చేపట్టాలని, వారి సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవాలని సీఎస్ కె.రామకృష్ణారావుకు తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) విజ్ఞప్తి చేసింది. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల ఆర్థిక, ఆర్థికేతర సమస్యలను సీఎ్‌సకు టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివా్‌సరావు నేతృత్వంలోని ప్రతినిధి బృందం వివరించినట్లు గురువారం ఓ ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..
అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..
జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..
For More AP News and Telugu News