జీవిత బీమా పునరుద్ధరించండి: గిగ్ వర్కర్లు
ABN , Publish Date - Jan 18 , 2025 | 04:35 AM
గత తొమ్మిదేళ్లు రాష్ట్రంలో అమల్లో ఉన్న గిగ్ వర్కర్ల జీవిత బీమా ముగిసిపోయిందని, అధికారుల నిర్లక్ష్యంతో ఈ పథకం నిలిచిపోయిందని,

హైదరాబాద్, జనవరి 17(ఆంధ్రజ్యోతి): గత తొమ్మిదేళ్లు రాష్ట్రంలో అమల్లో ఉన్న గిగ్ వర్కర్ల జీవిత బీమా ముగిసిపోయిందని, అధికారుల నిర్లక్ష్యంతో ఈ పథకం నిలిచిపోయిందని, దీనిని వెంటనే పునురుద్ధరించాలని ప్రభుత్వాన్ని తెలంగాణ గిగ్ వర్కర్స్ ప్లాట్‌ఫాం కోరింది. సామాజిక భద్రత పథకంలో భాగంగా రాష్ట్రంలోని రవాణా, రవాణేతర ఆటో క్యాబ్ డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులకు 2015 నుండి అమలులో ఉన్న ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం రూ. 5 లక్షల ప్రమాద బీమా అందించిందని గిగ్ వర్కర్స ప్లాట్‌ఫాం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.