Fee Structure: ప్రైవేట్ అన్-ఎయిడెడ్ కాలేజీల్లో ఫీజుల నిర్ధారణకు కమిటీ
ABN , Publish Date - Jul 26 , 2025 | 04:41 AM
రాష్ట్రంలోని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో 2025-28 కాలానికిగాను ఫీజుల నిర్ధారణకు తీసుకోవాల్సిన ప్రామాణికతలపై సిఫారసు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆధ్వర్యంలో ఏర్పాటు
హైదరాబాద్, జూలై 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని ప్రైవేట్ అన్-ఎయిడెడ్ ప్రొఫెషనల్ కాలేజీల్లో 2025-28 కాలానికిగాను ఫీజుల నిర్ధారణకు తీసుకోవాల్సిన ప్రామాణికతలపై సిఫారసు చేయడానికి ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫీజుల ఖరారు కోసం ఏయే అంశాలను ప్రామాణికంగా తీసుకోవాలి? సుప్రీంకోర్టు/హైకోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి? ఇతర రాష్ట్రాల్లో ఫీజుల నిర్ధారణకు ఏయే అంశాలు పరిగణనలోకి తీసుకుంటున్నారు? వంటి అంశాలపై అధ్యయనం చేసి సిఫారసులు చేసేందుకు శుక్రవారం ఈ కమిటీని ఏర్పాటు చేశారు.
ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా జీవో నం 29ను జారీ చేశారు. ఈ కమిటీ చైర్మన్‌గా ఉన్నత విద్యామండలి చైర్మన్ జి.బాలకిష్టారెడి,్డ సభ్యులుగా సాంకేతిక విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఎస్సీ అభివృద్ధి విభాగం డైరెక్టర్ ఎన్.క్షితిజ, స్టేట్ ఆడిట్ విభాగం డైరెక్టర్ ఎం.వెంకటేశ్వరరావు, డీటీసీపీ డైరెక్టర్ ఎస్.దేవేందర్‌రెడ్డి, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్ కె.వెంకటేశ్వరరావు, ఓయూ ఇంజనీరింగ్ కాలేజీలోని ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజనీరింగ్ డీన్ ఎ.కృష్ణయ్య, సభ్య కార్యదర్శిగా ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్ ఉంటారు. మరో ఇద్దరు నిపుణులను ఛైర్మన్ నియమించుకోవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా జోలికొస్తే అడ్డంగా నరికేస్తా..
బాలికపై అత్యాచారం.. గర్భం దాల్చిందని బతికుండగానే..
For Telangana News And Telugu News