Share News

Telangana floods: భీకర ప్రవాహం.. తెలంగాణ ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:26 AM

తెలంగాణాలోని అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తివేశారు. అటు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 32 గేట్ల ఎత్తివేసి నీటిని దిగువకి వదులుతున్నారు. సింగూరు, ఎల్లంపల్లి, గడ్డెన్న వాగు ప్రాజెక్టులకు భారీగా వరద నీరు..

Telangana floods:  భీకర ప్రవాహం.. తెలంగాణ ప్రాజెక్టులకు పోటెత్తుతోన్న వరద
Massive flood inflows into Telangana projects

ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణాలోని అన్ని ప్రాజెక్టులకు వరద ప్రవాహం పోటెత్తుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 3 గేట్లు ఎత్తివేశారు. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 20 వేల క్యూసెక్కులుగా ఉండగా, ఔట్ ఫ్లో కూడా 20 వేల క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 1405 అడుగులుకు చేరిపోయింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17 టిఎంసిలు కాగా, ప్రస్తుతం 17 టిఎంసిల నీరు ప్రాజెక్టులో ఉంది. దీంతో మూడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదులుతున్నారు. కాగా, నిజాంసాగర్ ప్రాజెక్టు కామారెడ్డి జిల్లా, నిజాంసాగర్‌ మండలంలోని అచ్చంపేట గ్రామం వద్ద మంజీరా నదిపై నిర్మించిన సంగతి తెలిసిందే.


అటు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి సైతం భారీగా వరద పోటెత్తుతోంది. ఈ ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1,09,654 క్యూసెక్కులు ఉండటంతో, 32 గేట్ల ఎత్తివేసి నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు ఔట్ ఫ్లో 1,09,654 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు ప్రస్తుత నీటి మట్టం 1091 అడుగులు, 80.5 టీఎంసీలు గా కొనసాగుతోంది. గోదావరి నదిపై నిజామాబాదు జిల్లా బాల్కొండ మండలములో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఉంది. దీని పూర్వపు పేరు పోచంపాడు ప్రాజెక్టు. గోదావరి నదిపై తెలంగాణలో ఇది మొట్టమొదటి ప్రాజెక్టు. మహారాష్ట్రలోని జైక్వాడి ప్రాజెక్టు తరువాత గోదావరి నదిపై దీనిని నిర్మించారు. ఇది.. రామగుండం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరు సరఫరా చేసే ప్రాజెక్టు.


తుఫాన్ నేపథ్యంలో భారీగా కురిసిన వర్షాలకు సింగూరు ప్రాజెక్టుకు కూడా వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఒక గేటు ఎత్తి అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో- 13388 క్యూసెక్కులుగా ఉంటే, ఔట్ ఫ్లో- 9581 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వ- 17.133 టీఎంసీలు ఉంటే, దీని పూర్తి స్థాయి నీటి సామర్ధ్యం- 29.917 టీఎంసీలు. సింగూరు డ్యాం తెలంగాణలోని సంగారెడ్డి పట్టణానికి సమీపంలోని సింగూరు గ్రామంలో ఉంది. ఇది నీటిపారుదల, జలవిద్యుత్, తాగునీటి ప్రాజెక్ట్ గా సేవలందిస్తోంది. హైదరాబాద్ నగరానికి త్రాగునీరు సింగూర్ డ్యాం నుండే వెళ్తుంది. సింగూర్ డ్యాం మంజీరా నదిపై నిర్మించారు.

Telangana-Projects-1.jpg


అటు, ఎల్లంపల్లి ప్రాజెక్టుకు కూడా భారీగా వరద నీరు వస్తోంది. దీంతో 23గేట్లు ఎత్తి వేసి, 2లక్షల క్యూ సెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. గడ్డెన్న వాగు ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి వేసి, 14 వేల క్యూ సెక్కుల నీరు కిందికి వదులుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూబ్లీహిల్స్‌.. భిన్నంగా ఓటర్‌ పల్స్‌!

బీఆర్‌ఎస్‌ గెలిస్తే మూడేళ్లు ఆగాల్సిన అవసరం రాకపోవచ్చు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 30 , 2025 | 10:39 AM