CM Revanth AWS meeting: తెలంగాణ సీఎంను కలిసిన అమెజాన్ వెబ్ సర్వీసెస్ బృందం..
ABN , Publish Date - Nov 04 , 2025 | 08:06 PM
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందం మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో అమెజాన్ వెబ్ సర్వీస్‌కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై సీఎంతో బృంద సభ్యులు చర్చలు జరిపారు (Telangana CM AWS).
పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అమెజాన్ బృందానికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. సీఎంను కలిసిన వారిలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని తదితరులు ఉన్నారు (AWS data center Telangana).
అంతకు ముందు సీఎంను జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం కలిసింది. డ్యుయిష్ బోర్స్ ( Deutsche Borse) కంపెనీ విస్తరణలో భాగంగా తమ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)ను ఈ రోజు నగరంలో ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రికి జర్మనీ బృందం వివరించింది. జీసీసీ ఏర్పాటుకు హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు జర్మనీ బృందానికి సీఎం ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని, ఇందుకు ప్రజాప్రభుత్వం పూర్తి మద్దతుగా నిలిచి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సీఎంకు పట్టుకున్న ఓటమి భయం: నిరంజన్ రెడ్డి
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం
Read Latest Telangana News And Telugu News