Telangana Assembly Live Updates: ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన
ABN , First Publish Date - Feb 04 , 2025 | 11:05 AM
Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి.
Live News & Update
-
2025-02-04T18:12:50+05:30
ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన
తెలంగాణ శాసనసభలో ఎస్సీ వర్గీకరణపై కీలక ప్రకటన
వర్గీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది
ఎస్సీ వర్గీకరణ రిపోర్టును శాసనసభలో ప్రవేశపెట్టిన సీఎం రేవంత్ రెడ్డి
-
2025-02-04T15:19:32+05:30
కులగణనపై బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్
కామారెడ్డి డిక్లరేషన్‌తో బీసీలు ఎంతో సంతోషించారు
ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎంతో బాధ కలుగుతోంది
కేవలం కంటి తుడుపు చర్యగానే ప్రభుత్వ పనితీరు కనిపిస్తోంది
సర్వే చూస్తుంటే ఏదైైనా కుట్ర జరిగిందా అనిపిస్తోంది
బీసీ జనాభాను తక్కువుగా చూపించారు
ప్రస్తుత బీసీ సంఖ్యను ఏ విధంగా నిర్ధారించారు
స్థానిక సంస్థల ఎన్నికలు ఆసల్యమైనా పర్వాలేదు.. బీసీలకు అన్యాయం చేయవద్దు
రాహుల్ వ్యాఖ్యల విని ఎంతో సంతోషపడ్డా
పార్లమెంట్‌లో రాహుల్ వ్యాఖ్యలకు తెలంగాణ ప్రభుత్వ తీరుకు పొంతనలేకుండా పోయింది
-
2025-02-04T15:08:48+05:30
కులగణనలో లోపాలు.. శాసనసభలో తలసాని
కులగణన సమగ్రంగా జరగలేదు
సర్వేను మరింత పకడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది
గ్రేటర్ హైదరాబాద్‌లో సర్వే సంపూర్ణంగా జరగలేదు
శాసనసభలో తీర్మానం వలన ఎలాంటి ఉపయోగం లేదు
కులగణనకు చట్టబద్ధత తీసుకురావాలి
కేంద్రానికి పంపిస్తామని చేతులు దులుపుకుంటే ఎలాంటి ఉపయోగం లేదు
సర్వేలో బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభాను తక్కువుగా చూపించారు
-
2025-02-04T14:17:47+05:30
తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ
-
2025-02-04T14:17:46+05:30
హైదరాబాద్: స్పీకర్‌తో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ
భేటీలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు నరేందర్‌రెడ్డి.
పాల్గొన్న అరికెపూడి, కాలె యాదయ్య తదితరులు.
అసెంబ్లీ కార్యదర్శి నోటీసుల నేపథ్యంలో సమావేశం.
-
2025-02-04T11:48:18+05:30
బీఆర్ఎస్ విప్‌లు వీరే..
బీఆర్ఎస్ నుంవి శాసనమండలి విప్ గా సత్యవతి రాథోడ్
అసెంబ్లీ విప్ గా కుత్భుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్
-
2025-02-04T11:48:17+05:30
బిగ్ బ్రేకింగ్.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు..
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు.
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది.
ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన అసెంబ్లీ కార్యదర్శి.
పార్టీ ఫిరాయింపుల పై లిఖిత పూర్వక సమాధానం చెప్పాలని నోటీస్.
పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టు ను ఆశ్రయించిన బిఆర్ఎస్.
-
2025-02-04T11:08:38+05:30
తెలంగాణ కేబినెట్ సమావేశం
కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై చర్చ
రెండు నివేదికలకు ఆమోదం తెలపనున్న కేబినెట్
అనంతరం అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు
కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై లఘుచర్చ
అసెంబ్లీలో కీలక ప్రకటన చేయనున్న సీఎం రేవంత్
కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. కేంద్రానికి పంపనున్న తెలంగాణ ప్రభుత్వం
-
2025-02-04T11:07:22+05:30
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.. వెంటనే వాయిదా..
మధ్యాహ్నం రెండు గంటల వరకు అసెంబ్లీ వాయిదా..
కేబినెట్ సమావేశం నడుస్తున్నందున కాసేపు సభను వాయిదా వేయాలని కోరిన అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు.
మధ్యన 2 గంటలకు వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్.
-
2025-02-04T11:05:56+05:30
ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ..
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నారు.