Share News

Harassment: లైంగిక వేధింపులు తాళలేక బాలిక మృతి !

ABN , Publish Date - Aug 27 , 2025 | 04:49 AM

తల్లికి దూరంగా తండ్రితో కలిసి జీవిసిస్తున్న ఓ బాలిక(17)పై ముగ్గురు యువకులు ఆకృత్యానికి పాల్పడ్డారు. ఆ వేధింపులు తాళలేక, కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక్ష క్షోభతో అనారోగ్యం పాలై ఆ బాలిక మరణించింది.

Harassment: లైంగిక వేధింపులు తాళలేక బాలిక మృతి !

  • వీడియోలు తీసి బెదిరిస్తూ ముగ్గురు యువకుల ఆకృత్యం

  • మానసిక క్షోభతో అనారోగ్యంపాలైన బాధితురాలు, మరణం

  • అంతకముందే రాసిన లేఖ, సెల్‌ఫోన్‌ వల్ల బయటపడ్డ ఘోరం

ఇల్లంతకుంట, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): తల్లికి దూరంగా తండ్రితో కలిసి జీవిసిస్తున్న ఓ బాలిక(17)పై ముగ్గురు యువకులు ఆకృత్యానికి పాల్పడ్డారు. ఆ వేధింపులు తాళలేక, కష్టాన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక మానసిక్ష క్షోభతో అనారోగ్యం పాలై ఆ బాలిక మరణించింది. పోలీసులు తెలిపిన వివరాలమేరకు రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలానికి చెందిన బాధిత బాలిక తల్లిదండ్రులు విభేదాల వల్ల వేర్వేరుగా ఉంటున్నారు. బాలిక తండ్రితో కలిసి నివసిస్తుండగా.. తల్లి, సోదరుడు మరో జిల్లాలో ఉంటున్నారు. తండ్రితో కలిసి సంతలో కూరగాయలు అమ్మే ఆ బాలికకు వినోద్‌ అనే యువకుడితో పరిచయమైంది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్నప్పుడు తీసిన వీడియోను వినోద్‌ తన స్నేహితుడు సతీశ్‌కు పంపాడు. సతీశ్‌ ఆ వీడియోను బాలికకు చూపించి ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.


ఆ తర్వాత ఆ వీడియోను జాషు అనే యువకుడికి పంపగా అతడు కూడా లైంగిక వేధింపులకు దిగాడు. తాము చెప్పినట్టు వినకపోతే వీడియోను సోషల్‌ మీడియాలో పెడతామని బెదించి బాలికపై ముగ్గురూ లైంగిక వేధింపులకు తెగబడ్డారు. భరించ లేకపోయిన ఆ బాలిక తనపై జరుగుతున్న ఆకృత్యాన్ని వివరిస్తూ కొద్ది రోజుల క్రితం ఓ లేఖ రాసుకుంది. మానసిక క్షోభతో కొద్ది రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యింది. జ్వరంతో బాధపడుతున్న బాలికకు సోమవారం ఫిట్స్‌ రావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బాలికను సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణం విడిచింది. అయితే, బాలిక ఉండే గదిలో ఆమె రాసిన లేఖతోపాటు ఓ సెల్‌ఫోన్‌ను కుటుంబసభ్యులు గుర్తించారు. ఆ సెల్‌ఫోన్‌లో యువకులు పంపిన వీడియోలను చూసి అవాక్కయ్యారు. దీనిపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సతీష్‌, వినోద్‌, జాషులపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

లిక్కర్ స్కామ్‌లో నిందితులకు మళ్లీ రిమాండ్ పొడిగింపు

ఈ రాశుల వారు.. ఈ మంత్రాలు చదివితే దశ..

For More Telangana News and Telugu News..

Updated Date - Aug 27 , 2025 | 04:49 AM