TBJPs Preparatory Meeting: బీజేపీ అధ్యక్షుడు రాం చందర్ రావుకు అవమానం
ABN , Publish Date - Aug 30 , 2025 | 06:31 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం టీబీజేపీ సన్నాహక సమావేశం సాక్షిగా తెలంగాణ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. టీబీజేపీ చీఫ్‌గా రాంచందర్‌రావు పేరుకు బదులుగా.. పదే పదే కిషన్‌రెడ్డి పేరును ప్రస్తావించారు ఎంపీ రఘునందన్‌రావు.
హైదరాబాద్, ఆగస్టు 30: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం టీబీజేపీ సన్నాహక సమావేశం సాక్షిగా తెలంగాణ బీజేపీలో విభేదాలు బయటపడ్డాయి. ఈ సాయంత్రం(శనివారం) హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం తెలంగాణ బీజేపీ సన్నాహక సమావేశం జరిగింది. ఈ భేటీలో టీబీజేపీ చీఫ్‌గా రాంచందర్‌రావు పేరుకు బదులుగా.. పదే పదే కిషన్‌రెడ్డి పేరును ప్రస్తావించారు ఎంపీ రఘునందన్‌రావు. రాంచందర్, రఘునందన్ మధ్య విభేదాల నేపథ్యంలోనే రఘునందన్ కావాలనే ఇలా అవమానించారంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది ముమ్మాటికీ బీజేపీ అధ్యక్షుడు రాం చందర్ రావుకు జరిగిన అవమానమేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:
కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్‌పై మాటల యుద్ధం..
15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి.. కేటీఆర్ డిమాండ్
మరిన్ని తెలంగాణ వార్తలు కోసం క్లిక్ చేయండి..