Share News

Task Force Raid: రూ.7.10 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం మాయం

ABN , Publish Date - Aug 13 , 2025 | 04:10 AM

పక్కదారి పట్టిన ధాన్యం, గన్ని బ్యాగుల విలువ సుమారు రూ.7.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మిల్లు యజమాని సత్యంపై కేసు నమోదు చేసినట్లుఅధికారులు తెలిపారు.

Task Force Raid: రూ.7.10 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం మాయం

  • సివిల్‌ సప్లై టాస్క్‌ ఫోర్స్‌ దాడుల్లో బయటపడ్డ వ్యవహారం

ఆమనగల్లు, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం పోలేపల్లి గేటు సమీపంలోని సాయిరామ్‌ రైస్‌మిల్లుపై మంగళవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు నిర్వహించిన దాడుల్లో రూ.7.10 కోట్ల సీఎంఆర్‌ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ ఆదేశానుసారం ఈ దాడులు నిర్వహించారు. 2022-23 రబీ సీజన్‌లో సాయిరామ్‌ రైస్‌ మిల్లుకు సివిల్‌ సప్లై ద్వారా 3,347.96 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అందజేశారు.


అందులో 1,980.13 మెట్రిక్‌ టన్నుల ధాన్యంతో పాటు గన్ని బ్యాగులు లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు. పక్కదారి పట్టిన ధాన్యం, గన్ని బ్యాగుల విలువ సుమారు రూ.7.10 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు. మిల్లు యజమాని సత్యంపై కేసు నమోదు చేసినట్లుఅధికారులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

బీసీ గర్జన సభను మరోసారి వాయిదా వేసిన బీఆర్ఎస్

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 13 , 2025 | 04:10 AM